31.2 C
Hyderabad
Saturday, March 15, 2025
spot_img

బ్రేకింగ్: ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు బాలికలు సజీవదహనం

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: బిహార్​లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ముజఫర్​పుర్​ జిల్లాలోని రామ్‌దయాళ్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రామ్‌దయాళ్​ ప్రాంతంలోని ఇరుకు ఏరియల్ నివసించే ఓ ఇంట్లో అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. వెనువెంటనే పక్కనే ఉన్న మరో మూడు ఇళ్లకి కూడా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు బాలికలు మంటల్లో చిక్కుకొని అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఇంట్లోని సామగ్రి కాలి బుడిదైంది. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. వారిని చికిత్స కోసం ఎస్​కేఎమ్​సీఎచ్​ ఆస్పత్రికి తరలించారు.

 

 

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్