స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ హీరోగా పాన్ ఇండియా మూవీగా ఎన్నో అంచనాలతో విడుదలైన ‘ఏజెంట్’ మూవీ మిశ్రమ స్పందనతో అభిమానులను నిరాశపర్చింది. సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడినా కథ, కథనాలు సరిగా లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో అఖిల్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు కొంత మంది నెటిజన్లు. ఈ ట్రోలింగ్ పై అఖిల్ తల్లి అమల స్పందించారు. ట్రోల్స్ ను అసలు పట్టించుకోవద్దని అఖిల్ కు సూచించానని తెలిపారు. ధైర్యంగా మాట్లాడలేనివాళ్లే ఇలా ట్రోలింగ్ చేస్తుంటారని పేర్కొన్నారు.
శుక్రవారం ‘ఏజెంట్’ సినిమాను తాను కూడా చూశానని.. తాను వెళ్లిన థియేటర్ మొత్తం నిండిపోయిందన్నారు. ముఖ్యంగా అమ్మాయిులు, అమ్మలు, అమ్మమ్మలు సినిమాను చూడటానికి వచ్చారని.. వారు అరుపులతో సినిమా ఎంజాయ్ చేశారని చెప్పారు. సినిమాలో కొన్ని తప్పులు ఉన్నప్పటికీ, ఓపెన్ మైండ్ తో చూస్తే కచ్చితంగా నచ్చుతుందని ఇన్ స్ట్రాగ్రాంలో ఓ పోస్టు పెట్టారు. అఖిల్ తర్వాతి సినిమా మరింత బెటర్ గా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని అమల ప్రామిస్ చేశారు.