21.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు.. ఉప్పొంగిన గులాబీ కెరటం

ఆరోజులు తలుచుకుంటే దుఃఖం వస్తది. ఆ బీడు భూముల్ని చూస్తే గుండె అలసిపోతది. ఉద్యోగాల్లేక నిరుద్యోగుల ముఖంలో ఆ నిస్సహాయతను చూస్తే.. బాదేస్తది. అయ్యో.. నా తెలంగాణకు ఇంకెప్పుడు మోక్షం అంటూ.. ఆనాటి ప్రజలు పాడుకున్న పాటల్ని వింటే.. దుఃఖం పొంగుకస్తది. పల్లెపల్లెనా పల్లేర్లు మొలిసే తెలంగాణలోనా.. నా పంట సెలలోనా అంటూ ఆనాటి పాటలు మన దీనస్థితిని తెలియజేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులు పుష్కలంగా ప్రవహిస్తున్నా.. మనకు ఈ నీటి గోస ఏందీ? తరగని సిరులున్న తెలంగాణలో ఒక్క రూపాయి కూడా.. ఆనాటి పాలకులు ఎందుకు ఖర్చు పెట్టలేదు. అనేక ఉద్యోగ ఖాళీలున్న మన రాష్ట్ర యువకులకు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు.. ఇవన్నీ మనసులో రగులుతున్న ఓ మేధావి.. తెలంగాణ బీడుభూముల్లో నడయాడుతూ.. తెలంగాణలో ఈ దుఃఖం పోవాలంటే ఏం చేయాలి. ఏం చేస్తే తెలంగాణ బాగుపడుతది. అంటూ అనేక ఆలోచనలు చేశాడు… ఇదంతా కాదు మన తెలంగాణాను మనం సాధించుకుంటే తప్ప… మనకు నీళ్లు, నిధులు, నియామకాలు రావు అని గట్టిగా సంకల్పించాడు. ఏదైతే అదయితది. తెలంగాణ వచ్చేదాకా కొట్లాడుడే… మన బీడుభూములు సస్యశ్యామలం కావాలంటే.. తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించాలని మనసులో గట్టిగా సంకల్పించాడు. అనేక రాజకీయ నేతలతో సమావేశంపై రాష్టానికి జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్నారు. తెలంగాణలోని పెద్ద కాలువ నుండి పిల్ల కాలువ వరకు అనేక విషయాలు తెలుసుకున్నాడు. రాష్టాన్ని సిద్దించాలన్న ఆకాంక్షతో నూతన పార్టీని స్థాపించాడు. 2001 ఏప్రిల్ 27 వ తేదీన ” తెలంగాణ రాష్ట్ర సమితి” స్థాపించి తెలంగాణకై కొట్లాడాడు.. అతడే కల్వకుంట చంద్రశేఖర్ రావు.. ప్రజలు ముద్దుగా పిలుచుకునే కేసీఆర్.

టీఆర్ఎస్ స్తాపించిన తర్వాత రాష్ట్రం అంతటిని ఏకం చేయడానికి నడుం కట్టాడు. రాజకీయనాయకులతో మంతనాలు జరిపి టీఆర్ఎస్ బలం పెంచుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అనేక దీక్షలు, ధర్నాలు, ధూంధాంలు నిర్వహించారు. తెలంగాణ నినాదాన్ని పల్లెపల్లెకు చేర్చాడు. ప్రతి ఒక్కరి చేత జై తెలంగాణ అనే నినాదం అనేలా చేశారు. అనేక పోరాటాల నడుమ తెలంగాణ ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమానికి ఉద్యోగ సంఘాల నేతలు కలిసి వచ్చారు. ఉస్మానియా, కాకతీయ, సహా తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు ఏకమై.. తెలంగాణ సిద్దించడానికి కారణం అయ్యారు. చివరికి సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి.. చావు నోట్లో తలపెట్టి.. తెలంగాణ వస్తే గాని.. చుక్క నీరును కూడా ముట్టుకోను అని చేసిన ప్రతిజ్ఞతో కేంద్రం కదిలింది. తెలంగాణ ఏర్పాటు బిల్లును పాస్ చేసింది. చివరికి అనేక మంది ఉద్యమ వీరుల బలిదానం, టీఆర్ఎస్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పడింది.

అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక మెజారిటీ సాధించి విజయ దుందుభి మోగించింది. ఆ తర్వాత తెలంగాణకు మొదటి సీఎంగా సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ఏర్పడ్డ నాటినుండి ఇప్పటివరకు.. అంటే సుమారు 9 సంవత్సరాల సుదీర్ఘ పాలనను సీఎం కేసీఆర్ చేశారు. రాష్ట్రాన్ని ఓ వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధితో ముందుకు సాగిస్తూ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రైతుబంధు పథకం, రుణ మాఫీ పథకం, రైతుబీమా పథకం, కేసీఆర్ ఆసరా పెన్షన్, కల్యాణ లక్ష్మి, షాదీ ముభారఖ్, అమ్మ ఒడి & కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, తెలంగాణ పల్లె ప్రగతి పథకం, మన ఊరు – మన ప్రణాళిక, మన ఊరు – మన బడి.. ఇలా అనేక పథకాలను రాష్ట్రంలో ప్రవేశ పెట్టాడు.

ఓ వైపు తెలంగాణ శరవేగంగా అభివృద్ధి జరుగుతుంటే.. దీనికి ఓర్వలేని అధికార కేంద్ర బీజేపీ, తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతోందని భావించి జాతీయ రాజకీయాల్లో తమ బలం చూపాలని మరో పరిణామానికి శ్రీకారం చుడ్డాడు. జాతీయ పార్టీని స్థాపించి దానికి “భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)” అని పేరుపెట్టారు. దేశాన్ని మొత్తం బీజేపీ దోచుకుంటుందని…తెలంగాణ తరహా మిగితా రాష్ట్రాలను కూడా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నాడు. దేశ రాజకీయాల్లో తనదైన రీతిలో ఎప్పటికి కప్పుడు గళం వినిపిస్తూ బీజేపీ సత్తాను దేశానికి తెలియజేస్తున్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీఆర్ఎస్ పార్టీ తరఫున భారత ప్రధానమంత్రిగా గెలుపొంది… రాష్ట్రాలను సుభిక్షంగా అభివృద్ధి చేయాలన్న దీక్షతో అహర్నిశలు పరుగులు తీస్తున్నారు. దేశ ప్రజలు బీఆర్ఎస్ కు ఎంత మేర సపోర్ట్ చేస్తారో వేచి చూడాలి మరి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్