YS Sharmila | వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరైంది. ఈమేరకు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు… షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. రూ.30 వేలతో ఇద్దరి జామీను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా విదేశాలకు వెళ్తే కోర్టు అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలని షరతు విధించింది. కాగా, సోమవారం పోలీసులపై షర్మిల చేయిచేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. నేడు విచారణ చేపట్టి తీర్పును వెలువరించింది.


