ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. గల్లీ గల్లీలో పదుల సంఖ్యలు వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డుపై నడవాలంటే.. ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏ వైపు నుండి ఏ కుక్క వచ్చి కరుస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. దాదాపు రెండు నెలలుగా వీధి కుక్కలు రోడ్డుపై నడిచేవారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. మరికొన్ని చోట్ల కుక్కల దాడిలో చిన్న పిల్లలు చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
తాజాగా ఏపీలో మరో ఘటన చోటుచేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటిపల్లిపాలెం గ్రామంలో ఉపాధి పనులు చేసుకుంటున్న కూలీలపై కుక్కలు దాడికి ఎగబడ్డాయి. ఈ ఘటనలో దాదాపు 11 మంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. బయాందోళననను కలిగిస్తున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో అక్కడి స్థానికులు కుక్కుల బెడదను నివారించదానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.