Oscar Awards |ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 95వ ఆస్కార్ వేడుక ఘనంగా ప్రారంభమైంది. ఆస్కార్ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ పాంథర్ సూట్‌లో కనువిందు చేసి అందరిని ఆకట్టుకున్నారు. సూట్‌పై గోల్డ్ కలర్ తో గర్జించే పులి బొమ్మ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే రెడ్ కార్పెట్ మీదకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ ను టైగర్ పిక్చర్ గురించి నిర్వహాకులు ఆరా తీశారు. దీనికి సమాధానంగా ఎన్టీఆర్ చెబుతూ.. పులి.. భారత్ జాతీయ మృగం అని చెప్పారు. విశ్వవేదికపై మొదటగా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌తో అవార్డులు ప్రధానోత్సవం ప్రారంభమైంది.
Oscar Awards |బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా క హుయ్ క్వాన్ అవార్డ్
సపోర్టింగ్ యాక్టర్‌ని జ్యూరీ అనౌన్స్ చేస్తూ… బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా క హుయ్ క్వాన్ అవార్డ్ అందుకుంది. క్వాన్ ‘ఎవరిథింగ్ ఎవిరీవేర్ ఆల్ ఆట్ ఒన్స్’ లో నటించింది.
ఉత్తమ సహాయనటిగా జెమీ లీ కర్టిస్:
ది బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డ్ ను ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ కి జామీ లీ కర్టిస్ సాధించింది. వేదికపై అవార్డ్ అందుకున్న జామీ లీ.. చిత్రయూనిట్ తోపాటు.. తనకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. తన కుటుంబానికి ప్రేమతో కృతజ్ఞతలు తెలిపింది.
బెస్ట్ డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా ‘నవల్నీ’
బెస్ట్ డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా ‘నవల్నీ’ అవార్డ్ గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం ఆల్ దట్ బ్రీత్స్, ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్ షెడ్, ఫైర్ ఆఫ్ లవ్, ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్ప్లింటర్స్, నవల్నీ పోటీ పడ్డాయి.
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ ‘ఆన్ ఐరిష్ గుడ్ బై’ చిత్రం:
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఆన్ ఐరిష్ గుడ్ బై చిత్రం ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం ఇవాలు, లే పపిల్లే, నైట్ రైడ్, ది రెడ్ సూట్ కేస్ చిత్రాలు పోటిపడ్డాయి.
బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డ్ ‘జేమ్స్ ఫ్రెండ్’..
ఉత్తమ సినిమాటోగ్రఫీ ఆస్కార్ అవార్డ్ జేమ్స్ ఫ్రెండ్ కు అందుకున్నారు. ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ చిత్రానికి ఈ అవార్డ్ అందుకున్నారు. ఈ అవార్డ్ కోసం డారియస్ ఖోండ్జ్..”బార్డో, ఫాల్స్ క్రానికల్ ఆఫ్ ఎ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ట్రూత్స్”, మాండీ వాకర్.. “ఎల్విస్”, రోజర్ డీకిన్స్.. “ఎంపైర్ ఆఫ్ లైట్”, ఫ్లోరియన్ హాఫ్‌మీస్టర్.. “తార్” పోటీ పడ్డారు.
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా ‘గులెర్మో డెల్ టోరోస్ పినోచియో’..
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా గులెర్మో డెల్ టోరోస్ పినోచియో చిత్రం అవార్డ్ గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం మార్సెల్ ది షెల్ విత్ షూస్ ఆన్, పస్ ఇన్ బూట్స్: ది లాస్ట్ విష్, ది సీ బీస్ట్, టర్నింగ్ రెడ్ సినిమాలు పోటీ పడ్డాయి.
Read Also: లాస్ ఏంజిల్స్ లో ప్రారంభమైన 95వ ఆస్కార్ వేడుకలు
Follow us on: Youtube Instagram