Corona Bulletin | దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటివరకు దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 24 మంది కరోనాతో మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 60,313 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4.48 కోట్ల కరోనా కేసులు నమోదు కాగా, 5.31లక్షల మంది మరణించారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 8.40 శాతంగా ఉంది.