స్వతంత్ర వెబ్ డెస్క్: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గువాహటిలోని జలూక్‌బరీ ప్రాంతంలో రెండు కార్లు ఢీకొన్నడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో గువాహటిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు తమ ప్రాణాలను కోల్పోయారు. మరో ఆరుగురు విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది.