స్వతంత్ర, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా పత్తిపాడు ఘటనలో మృతి చెందిన వారికి సీఎం జగన్ 5 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించారని మాజీ హోం మంత్రి సుచరిత తెలిపారు. గాయాలు పాలయిన వారికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారని అన్నారు. చిన్నపాటి గాయాల వారికి మెరుగైన వైద్యంతో పాటు 25 వేల ఖర్చులు ఇస్తామని సీఎం ప్రకటించారని తెలిపారు.
గుంటూరు జిల్లా పత్తిపాడు వట్టచేరుకురు ప్రమాదం బాధాకరమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చనిపోయిన వారికి ఐదు లక్షలు,మెరుగైన గాయాలు కి ఒక లక్ష రూపాయం సీఎం ప్రకటించారని అన్నారు. చనిపోయిన కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామన్న సీఎం.. ఒకే కుటుంబం చెందిన వారు చనిపోవడం బాధాకరమని అన్నారు. చనిపోయిన వారికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.