స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్. షర్మిల. రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై ప్రతిపక్షాలు చేసేది గోబెల్స్ ప్రచారమైతే.. 9 ఏళ్లుగా అబద్ధాల పాలన చేసే మిమ్మల్ని ఏమనాలి హరీష్ రావు గారు? అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. గోబెల్స్ ప్రచారానికి అసలుసిసలు వారసులు మీరు, మీ ముఖ్యమంత్రి. బంగారు తునక అని చెప్పి 4.50లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు. అంత అప్పు చేసినా రుణమాఫీకి డబ్బు లేదు. డబుల్ బెడ్ రూంలకు డబ్బు లేదు. కొత్త పెన్షన్లకు డబ్బు లేదు. చివరకు జీతాలు ఇవ్వడానికి కూడా దిక్కులేక ఆస్తులు అమ్ముతున్నారు. మీరు చేసిన అప్పులకు ఏడాదికి రూ.30వేల కోట్ల మిత్తీలే కట్టాలి… అంటూ మండిపడ్డారు.
వైఎస్. షర్మిల వ్యాఖ్యలు:
👉🏻దేశానికి తెలంగాణ దిక్సూచి అంటే రాష్ట్రాన్ని అమ్మేసి, అంధకారంలో నెట్టేయడమా?
👉🏻50 లక్షలకు నిరుద్యోగులు పెరగడం ప్రగతి అంటారా?
👉🏻9 ఏళ్లలో ముష్టి 65 వేల ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప విషయమా..? ఒక్క గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వలేదు మీ పాలనలో..
👉🏻ఉద్యోగాలు రాక యువత ఉరికొయ్యలకు వేలాడటం రాష్ట్ర అభివృద్ధా?
👉🏻లక్ష రుణమాఫీ అని చెప్పి 30 లక్షల మంది రైతులను మోసం చేశారు. 9 వేల మంది రైతులు ఆత్మహత్యలకు కారణం అయ్యారు.
👉🏻నిధులు మీకే,నీళ్ళు మీకే,నియామకాలు మీకే.. ఇదేనా బంగారు తెలంగాణ?
👉🏻1.20లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే 1.52 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వడం ప్రగతికి అద్దం పట్టినట్లా..?
👉🏻విద్యుత్ సంస్థలను దివాలా తీసి, 26 వేల కోట్ల అప్పులకు నెట్టారు.
👉🏻RTCని ఆదుకుంటామని చెప్పి, రూ.10 వేల కోట్ల అప్పుల్లో ముంచారు.
👉🏻26 వేల మందికే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చి, మిగతా ఇల్లు లేని 30 లక్షల మందిని మోసం చేశారు.
👉🏻9 లక్షల కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లకు దిక్కే లేదు.
👉🏻ఫీజు రీయింబర్స్మెంట్ కింద 18 లక్షల మంది విద్యార్థులకు రూ.5వేల కోట్లు ఎగ్గొట్టారు.
👉🏻రూ.800కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు ఎగ్గొట్టారు.
👉🏻జీవోలు ఇచ్చి రూ.2వేల కోట్ల నిధులివ్వకుండా సర్పంచులను చంపుకుతింటున్నారు.
👉🏻18.70 లక్షల కుటుంబాల్లో కేవలం 32 వేల మందికే దళితబంధు ఇచ్చారు. అందులో సగం మీ ఎమ్మెల్యేలే బుక్కారు.
👉🏻ఇలా చెప్పుకుంటూ పోతే మీ మోసాలు రాస్తే రామాయణం.. వింటే మహాభారతం!
👉🏻అయ్యా మంత్రి గారు.. వెనకబాటు నుంచి వెలుగులోకి కాదు.. వెనకబాటు నుంచి రాష్ట్రాన్ని మీ ధనదాహంతో అంధకారంలోకి నెట్టారు.
👉🏻తొమ్మిదేళ్ళ పాలనలో ప్రజలు అప్పుల పాలైతే ..మీ బంధిపోట్ల రాష్ట్ర సమితి నేతల ఆస్తులు అంతకంతకూ పెరిగినయ్. మీ పార్టీ అకౌంట్ లో 12 వందల కోట్లు జమ చేశారు.
👉🏻మీ అరాచకాలను ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులు.. గృహ నిర్భందాలు…సంకెళ్లు..!
👉🏻మీ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టి దొంగల పాలనను అంతం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.