సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆది, సోమవారాల్లో మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతాయి. రేపు బోనం, తర్వాత రంగం, అంబారి కార్యక్రమం నిర్వహిస్తారు. మహంకాళి బోనాలకు 15 వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 400 CC కెమెరాలతో నిఘా పెట్టారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మహంకాళి బోనాలకు ఈ సారి 15 లక్షల మంది వస్తారని అంచనా. బోనాలకు ప్రత్యేకంగా TGRTC 175 బస్సులు అందుబాటులోకి ఉంచింది. హైదరాబాద్, 24 ప్రాంతాల నుంచి TGRTC ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.