స్వతంత్ర, వెబ్ డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు మీద మాట్లాడే హక్కు వైసీపీకి లేదన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. ఏమైనా మాట్లాడాలి అనుకుంటే రాష్ట్ర ముఖ్య మంత్రి మాట్లాడాలి.. అంతేకాని వేరే వాళ్ళు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఒక్క విశాఖ జిల్లా లో 150 కోట్లు భూకుంభకోణం జరిగింది. మీడియా సమావేశంలో మాట్లాడిన సోము.. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా జరుగుతోందని అన్నారు. వైసీపీ పాలనలో అనేక ఏళ్ళు గా ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో 9 ఏళ్ల మోదీ అభివృద్ధి మీద ఎవ్వరు వచ్చినా మాట్లాడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
“వైసిపి రాష్ట్రాన్ని దోచుకుంటుంటే ప్రజలను మేము ఆదుకుంటున్నాము. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. పేర్ని నాని కి ఎన్ ఐ పి అంటే తెలుసా. చిలక జోస్యం చెప్తున్నాడు. బస్ లు కూడా తిరగని రాయలసీమకి విమానాలు తిప్పుతున్నాము. ఈ నాలుగేళ్లలో ఒక్క రోడ్ కూడా వేయ్యలేకపోయారు. 2014 లో, మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలో వైసిపి మీద కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఉమ్మేశారు. మా అఖిల భారత అధ్యక్షుడుకి రాసిస్తే చదివే అలవాటు లేదు. బిజెపి కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఉరుకొము.” – సోము వీర్రాజు


