అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో పక్కింట్లో ఉండే 13 ఏళ్ల బాలుడితో ఓ మహిళ శారీరక సంబంధం ఏర్పరుచుకుంది. ఇప్పుడామె గర్భవతి కావడంతో విషయం కోర్టుకు చేరింది. ఈ కోర్టును పరిశీలించి ఎలాంటి తీర్పు ఇవ్వాలో తెలియక న్యాయమూర్తులు తలలు పట్టుకున్నారు.
ఆండ్రియా సెరానో(31) అనే మహిళ.. పక్కింట్లో ఉన్న 13 ఏళ్ళ బాలుడిని ఇంటికి పిలిపించుకుని రాసక్రీడలు సాగించేది. ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బాలుడిని హెచ్చరించింది. దీంతో ఆ బాలుడు ఎవరికి చెప్పలేదు. వయసురీత్యా ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉండడంతో ఎవరూ అనుమానించలేదు. తీరా ఆమె గర్భం దాల్చడంతో విషయం బయటపడింది. మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపిస్తూ పోలీసులు ఆండ్రియాను అరెస్టు చేశారు. తమ మధ్య లైంగిక పరమైన సంబంధం నిజమేనని విచారణలో ఆండ్రియా అంగీకరించింది. అంతేకాదు, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు బాలుడే తండ్రి అని చెప్పింది. దీంతో ఏ తీర్పు ఇవ్వాలో తలపట్టుకున్నారు ఆ న్యాయమూర్తులు.