స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కల్తీ మద్యం అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటూనే ఉంది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కల్తీ రాయుళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా తమిళనాడులో ఇలాంటి విషాద ఘటనే చోటుచేసుకుంది. చెంగల్‌పట్టు, విలుప్పురం ప్రాంతాల్లో కల్తీ మద్యం సేవించి దాదాపు 12 మంది చనిపోయారు. ఈ దుర్ఘటనకు కారణమైన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటనపై ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. ఇంతమంది చావులకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.