Poisonous Snakes in Chennai Airport | విమానాశ్రయాల్లో చాలా చోట్ల డ్రగ్స్, బంగారం అక్రమంగా సరఫరా చేయడం చూసుంటాం. కానీ చెన్నై విమానాశ్రయంలో ఓ మహిళ చేసిన పనికి అధికారులకు దిమ్మ తిరిగింది. చెన్నై ఎయిర్ పోర్ట్ లో పాముల సరఫరా కలకలం రేపింది. కౌలాలంపూర్ మహిళా ప్రయాణికురాలి వద్ద శనివారం 22 పాములు గుర్తించారు కస్టమ్స్ అధికారులు. లగేజ్ బ్యాగ్ తనిఖీ చేయగా 10 అడుగులకు పైగా పొడవు ఉన్న విషపూరిత పాములు బయటకు రావడంతో ఒక్కసారిగా కస్టమ్స్ అధికారులు షాక్ అయ్యారు. దీంతో ప్రయాణికురాలి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విషపూరిత పాముల సరఫరాకు గల కారణాలు తెలియాలి ఉంది.


