తెలంగాణలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో గంజాయి చాక్లెట్లను పోలీసులు పట్టుకున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టైంది. కోకాపేట్ ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఒడిస్సాకు చెందిన సౌమ్యా రాజన్‌గా గుర్తించారు. పక్క సమాచారంతో పట్టుకుని 40 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ అపార్టుమెంట్‌లో కార్మికులకు అమ్ముతుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. సోమ్య రాజన్ ఒడిస్సా నుంచి హైదరాబాదుకు ఉపాధి కోసం వచ్చి గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.


