26.7 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

స్వామివారి సన్నిధిలో……

తిరుమల శ్రీవారిని ఉదయం విఐపి విరామ సమయంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి , తెలంగాణ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్, నందమూరి తేజస్విని వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండ పంలో వేద పండితులు వేద ఆశీర్వాదం ఇవ్వగా, టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందిం చారు.

సబ్సిడీ సిలిండర్‌పై కసరత్తు

రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలుకై అర్హులైన లబ్దిదారుల్ని ఎంపిక చేసే పనిలో నిమగ్న మైంది రేవంత్‌ సర్కార్‌. రేషన్‌కార్డు ఉన్నవారే ఈ పథకానికి అర్హులంటూ ప్రకటించిన ప్రభుత్వం గత మూడేళ్లలో వినియోగించిన గ్యాస్‌ సిలిండర్ల సగటును పరిగణనలోకి తీసుకోనుంది. ఆధార్‌ లింక్‌ కూడా తప్పనిసరి చేసింది.

గైర్హాజరుకు కారణాలేమిటో…?

రాష్ట్రంలో ఆరంభమైన పోలీస్‌ కానిస్టేబుళ్ల శిక్షణకు తొలిరోజు భారీగా శిక్షణార్ధులు గైర్హాజయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల 953 మంది ఎంపికకాగా తొలి దశలో 9వేల 333 మందికి శిక్షణకు హాజరు కావాల్సి ఉండగా తొలిరోజు ఆరు వేల 500 మంది మాత్రమే హాజరయ్యారు. పోలీసు శాఖలో ఈ అంశం చర్చనీ యాంశమైంది. గైర్హాజరైన శిక్షణార్ధులకు ఈ నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని పోలీసు శాఖ నిర్ణయిం చినట్లు సమాచారం.

చాట్‌ తరహాలో భారత్‌ జీపీటీ

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ – 8 యూనివర్సిటీలు కలసి భారత్‌ GPT పేరిట కన్సార్షియంగా ఏర్పడ్డాయి. చాట్‌జీపీటీ తరహా సేవలను హనూమాన్‌ పేరుతో మార్చి నెలలో ఈ కన్సార్షియం ఆవిష్కరణ జరగనుంది. హనూమాన్‌ మోడల్‌ సక్సెస్‌ అయితే 11 భాషల్లో ఆరోగ్యం, పాలన, ఆర్ధిక సేవలతోపాటు విద్యా రంగ సేవలు అందుబాటులోకి రావొచ్చని భావిస్తున్నారు.

దాడిని ఖండించిన మంత్రి

ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దర్శించుకున్నారు. మంత్రికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా అధికారులు తీర్థప్రసాదాలను అందించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లా డుతూ జర్నలిస్టులపై దాడిని ఖండించారు. మంచి పనులు చేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రజల గుండెల్లో నిలుస్తారన్నారు.

నివేదిక కోరాం

సిద్దిపేట పట్టణంలో అగ్ని ప్రమాదానికి గురైన 220 కె వి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ఘటన దురదృష్టకరమన్న మంత్రి వెంటనే మరమ్మత్తులు చేపట్టి విద్యుత్‌ను పునరు ద్ధరించినట్లు చెప్పారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ప్రమాదానికి గల కారణాలపై అధికారుల నుండి నివేదిక కోరినట్లు మంత్రి పొన్నం చెప్పారు.

ఆసక్తి రేపుతున్న ఎస్పీ ఫ్లెక్సీలు

మేడారం జాతరలో ఎస్పీ నాగరాజు పేరుతో ప్లెక్సీలు దర్శనమివ్వడం ఆసక్తి రేపుతోంది. మల్లంపల్లి నుండి మేడారం, మణుగూరు నుండి మేడారం వరకు పెద్దసంఖ్యలో ప్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ప్లెక్సీలు ఏర్పాటు కావడం వెనుక మహబూబాబాద్ ఎంపీగా నాగరాజు కాంగ్రెస్ టికెట్ ను ఆశిస్తుండటమేనన్న వార్తలు గుప్పుమన్నాయి.

అసత్య ప్రచారం వద్దు…

  పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై ఫైర్ అయ్యారు పాలకొల్లు వైసీపీ ఇన్చార్జ్ గూడాల శ్రీహరి గోపాలరావు. తాను ఓటుకు 2 నుండి 5వేల రూపాయలు ఇస్తానని నిమ్మల అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమపై బురద జల్లే రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు.

దురదృష్టకరం

కూకట్ పల్లి మూసాపేట్‌ లో పాత భవనం కూల్చివేత సమయంలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమా దంలో అద్దెకుంటున్న వ్యక్తి స్వామి రెడ్డి రాజు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేపట్టారు.

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌

పంజాబ్‌ పరీద్‌కోట్‌ జిల్లాకు చెందిన 74 ఏళ్ల బల్వీందర్‌ సింగ్‌ 112.4 కిలోమీటర్లు హ్యండిల్‌ పట్టు కోకుం డా బైక్‌ను నడిపి చరిత్ర సృష్టించాడు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్ధానం సంపాదించాడు. 2023 నవంబర్‌ 16న మఖా నుండి బరిండా వరకు మోటార్‌సైకిల్‌పై ప్రయాణించా..నాతో పాటు ఒక వ్యక్తి, అంబులెన్స్‌ కూడా ఉందన్నాడు బల్వీందర్‌. తన తదుపలి లక్ష్యం 200 కిలోమీటర్ల దూరాన్ని చేధించడమేనన్నారు సింగ్‌

రేపటి నుండి మహిళల ఐపీఎల్‌

మహిళల IPL రెండో సీజన్‌కు రంగం సిద్దమైంది. తొలి సీజన్లో విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్‌ జట్టు రెండో సీజన్‌లో టైటిల్‌ ఫేవరేట్‌గా దిగుతోంది. 23వ తేదీన జరిగే తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండి యన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తలపడనున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్