విధినిర్వహణలో మరణించిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు 30 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ఢిల్లీహైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. డ్రైనేజీలలోనూ, మ్యాన్ హోల్స్ లోనూ దిగి ప్రమాద కరమైన పరిస్థితుల్లో పనిచేస్తూ.. మర ణించిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు, భర్తను కోల్పోయిన వితంతువులకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటివరకూ కేవ లం 10 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించి చేతులు దులుపు కుంటోందని వితంతువులు పిటిషనర్లు తెలిపా రు. ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించి తనకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినప్పుడు, అదే విధమైన వ్యక్తులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అదే ప్రయోజనాన్ని అందించాలని ఆశిస్తామని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.మాన్యువల్ స్కావెంజింగ్ లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు రిట్ పిటిషన్లు దాఖలు చేసి కోర్టును ఆశ్రయించడానికి బదులుగా అందరికీ మిగిలిన రూ .20 లక్షలనుచెల్లించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కోర్టు ఆశిస్తోందని జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ తెలిపారు.


