వైఎస్ ఆర్టీపీ అధినేత్రి షర్మిల.. కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 4న ఉదయం 11 గంటలకు ఆమె కాంగ్రెస్‌లో చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 4న ఢిల్లీకి రావాలంటూ షర్మిలకు పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆహ్వానం పంపారు. ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్‌తో భేటీ తర్వాత ఆమెకు ఇచ్చే పదవిపై స్పష్టత రానుంది.
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. ఏపీలో షర్మిల సేవలను వాడుకోవాలని పార్టీ అదిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షర్మిల చేరికను ఏపీ కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో అందు బాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలతో షర్మిల అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్టీ విలీనం, భవిష్యత్ కార్యా చరణపై చర్చించారు. పార్టీని విలీనం చేసేందుకు సిద్ధమైనట్టు పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చారు.