పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లలో పోటీ చేసి 10 సీట్లకు పైగా గెలవాలని విజయ సంకల్ప యాత్ర ప్రారంభించామని మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గజ్వేల్ లో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఈటల.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని.. కానీ ఇప్పటికీ ఒక్క హామీ కూడా నెరవెర్చలేదన్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు దొరకని సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి తన తరపున విన్నవిస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రజలు పార్టీలకు అతీతంగా మోదీకే ఓటు వేస్తామని అంటున్నారని చెప్పారు. దేశం సుభిక్షంగా ఆత్మ గౌరవంతో బ్రతకాలంటే మోదీ కే ఓటు వేయాలని కోరారు.