విజయవాడ ఎంపీ సీటు అన్నదమ్ముల సవాల్ గా మారింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టీడీపీ టికెట్ లభిస్తుందా.. నానికి అతడి సోదరుడు కేశినేని చిన్నిగా పిలిచే శివనాథ్ చెక్ పెడతారా అన్నది కోటి డాలర్ల ప్రశ్న. కొద్దికాలంగా కేశినేని నాని వ్యవహారంలో టీడీపీ అధినేత అసంతృప్తిగా ఉన్నారు. కేశినేని నానికి.. పోటీగా కేశినేని చిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ.. దూసుకెళ్తున్నారు. దీంతో కేశినేని బ్రదర్శ్ లో ఎవరికి తెలుగుదేశం పార్టీ టికెట్ లభిస్తుందో అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
విజయవాడలో టీడీపీ ఎంపీ టికెట్ కోసం కేశినేని బ్రదర్స్ ఇద్దరూ పోటీపడుతున్నారు. వీరిద్దరిలో ఎవరికి విజయవాడ ఎంపీ సీట్ వరిస్తుందో తెలియదు. కానీ ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం వర్గ విభేదాలు జోరందుకున్నాయి. విజయవాడలో ఎక్కడ అభివృద్ధి పనులు జరిగితే అక్కడ ప్రోటోకాల్ ప్రకారం విజయవాడ ఎంపీగా కేశినేని నాని కి ఆహ్వానం అందిస్తే వెళ్తున్నారు. అయితే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంపీ హాజరుకావడం పట్ల టీడీపీ అధిష్టానం అసంతృప్తితో ఉంది. గతంలో ఎన్టీఆర్ జిల్లా లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి హాజరైన కేశినేని నాని ఎంపీ సీట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికలకు మోసపూరిత వ్యక్తులు, కాల్ మనీ కేసు లు ఉన్న వారు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సోదరుడు కేశినేని శివనాధ్ పై చురకలు అంటించారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు టీడీపీ ఎంపీ కేశినేని నాని వర్గం ఒక వైపు, చిన్ని వర్గం ఒక వైపు ఉంది. కేశినేని చిన్ని అతి తక్కువ కాలంలోనే ఎన్టీఆర్ జిల్లా ప్రజలకి దగ్గరయ్యారు. పలు స్వచ్చంద సేవా కార్యక్రమాలతో ప్రజలకి చేరువవడమే కాక, సైన్యాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఈసారి విజయవాడ ఎంపీ సీటు తనకే వస్తుందని ధీమాతో ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా లో ఇదే పెద్ద చర్చ. ఏదో ఒక కార్యక్రమంలో కేశినేని బ్రదర్స్ పరస్పరం విమర్శలు కూడా చేసు కుంటున్నారు. కానీ అధిష్టానం ఎవరికీ సీట్ ఇస్తారో క్లారిటీ ఇవ్వకపోవటంతో విభేదాలు తారస్థాయి కి చేరుకుంటు న్నాయి.
ఎంపీ కేశినేని నాని అయితే ఈసారి తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయరని చెప్పటంతో నాని అసంతృప్తితో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఒక బీసీ వ్యక్తి కి టికెట్ ఇస్తే తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని నాని చెప్పుకొచ్చారు తాజా గా కేశినేని శివనాధ్ కి విజయవాడ ఎంపీ సీట్ ఇస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చార నే వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. దీంతో అధిష్టానం సీరియస్ అయింది. ఈ అసత్య ప్రచారాలు ఏంటని కేశినేని చిన్ని కి హెచ్చరికలు వచ్చాయంటున్నారు. మరో పక్క జనసేన- టీడీపీ సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇద్దరిలో ఎవరికి ఆహ్వానం పంపాలో తెలియక తెలుగు తమ్ముళ్లు తలలుపట్టుకుంటున్నారు. అధిష్టానం మౌనంతో పరిస్థితి చేయి దాటి పోవచ్చునని అంటున్నారు.
తిరువూరులో సమన్వయ సమావేశంలో కేశినేని బ్రదర్స్ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటం జిల్లాలో పెద్ద సమస్యగా మారింది. గో బ్యాక్ చిన్ని అంటూ ఎంపీ నాని వర్గీయులు నినాదాలు చేస్తుంటే గో బ్యాక్ నాని అంటూ చిన్ని వర్గీయులు ప్రతి దాడి చేసారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ ఘటన పై జన సైనికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఫ్లెక్సీ లో తమ అధినాయకుడి ఫోటో లేకపోవటం పై జన సైనికులు విరుచుకుపడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ బలోపేతం అవుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలపై అధిష్టానం జోక్యం చేసుకోకపోవడం పట్ల ఆందోళ న వ్యక్తమవుతోంది. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో టీడీపీ అధినాయకత్వం కఠినంగా విజయవాడ ఎంపీ సీట్ కోల్పోతామేమో అని టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలంటే ఇలాంటి విభేదాలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధినేతలపై ఉందని భావిస్తున్నారు.