విజయవాడ ఎంపీ సీటుపై క్లారిటీ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఇకపై పార్టీ వ్యవహారాల్లో తనను జోక్యం చేసుకోవద్దని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించారని కేశినేని నాని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇస్తున్నట్లు తనకు చెప్పారన్నారు కేశినేని నాని. చంద్రబాబు ఆదేశాలతో ఆలపాటి రాజా, కొనకళ్ల నారాయణ, నెట్టం రఘురాం తనను కలిసి ఈ విషయం తెలిపారని అన్నారు. తిరువూరు సభ విషయంలో తనను కలుగ చేసుకోవద్దని చెప్పారన్నారు. తిరువూరు సభకు వేరేవారిని ఇంచార్జ్‌గా నియమించినట్టు పార్టీ చెప్పిందని అన్నారాయన. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానంటూ ఫేస్‌బుక్‌లో ఈ మేరకు కేశినేని నాని పోస్ట్ చేశారు.