మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల దీక్ష చేపట్టారు. మెగా DSC డిమాండ్‌తో చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి చేపట్టిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సహా నేతలను పోలీసులు పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లోనే నిర్బంధించారు. ఆమె బయటకు రాకుండా భారీగా మోహ రించారు. గురువారం పార్టీ కార్యాలయం వద్దకు రావాలని ప్రయత్నించిన నేతలు గిడుగు రుద్రరాజు, తులసిరెడ్డి, మస్తాన్‌వలీలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ షర్మిల సహా పలువురు నేతలు కార్యాలయం వెలుపల ఆందోళనకు దిగారు. నేలపై బైఠా యించి నిరసన తెలిపారు. దీంతో ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులపై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు.వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారని షర్మిల మండిపడ్డారు. నిరుద్యోగులకు మద్దతుగా నిలబడితే అరెస్టు చేస్తు న్నారని ఆగ్రహవ వ్యక్తం చేశారు. తమని ఆపాలని చూసే మీరు ముమ్మాటికీ నియంతలే అంటూ విరుచు కుపడ్డారు. 23వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి.. కేవలం 6 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారని తెలి పారు. వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.


