రాబోయే ఎన్నికల్లో తానూ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి మేరుగ నాగార్జున. ఎన్నికల దృష్ట్యా టికెట్లు కేటాయింపులో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు అందరు కలిసి పని చేస్తామన్నారు. టీడీపీ నేతలు ఎందుకు భయపడుతన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన పార్టీ వ్యవహా రాలు చూసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్ ఎక్కడి నుంచి పోటీచేస్తున్నారునో చెప్పాలని సవాల్ విసిరారు. సామాజిక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ జగన్ పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు.