ప్రధానికి మోదీ పర్యటనలో భాగంగా లక్ష ద్వీప్‌లో మోదీ పర్యటించారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. లక్ష ద్వీప సముద్రంలో సాహసంతో కూడిన స్నార్కెంలింగ్ కూడా చేశారు. సముద్ర గర్భంలోని జీవరాశు లను ప్రత్యక్షంగా చూశారు. పగడాల దిబ్బలను కళ్లారా వీక్షించారు. ఆయన పర్యటనకు సంబంధించిన పలు ఛాయాచి త్రాలను తన ఖాతా ద్వారా పంచుకున్నారు. లక్షదీవుల ప్రకృతి అందచందాలతోపాటు అక్కడి ప్రజల మమకారం చూసి, ఆనందానకి లోనైనట్లు పంచుకున్నారు. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం తాను ఎలా పని చేయాలో అక్కడి వాతావరణం మరింత నేర్పిందని చెప్పారు. సాహసాలు చేయాలనుకునే యువత తమ లిస్ట్ లో లక్షద్వీపాలను కూడా చేర్చోవాలని ఈ సందర్భంగా చెప్పారు.