29.6 C
Hyderabad
Saturday, July 12, 2025
spot_img

రాజోలు, రాజానగరంలో జనసేన పోటీకి సిద్ధం

         సీట్ల పంపకానికి ముందే టీడీపీ ఏకపక్షంగా రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీంతో రాజోలు, రాజానగరం అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రకటనను సమర్థిస్తూ నాగబాబు ట్వీట్టర్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. న్యూటన్‌ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ టీడీపీకి పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చారు. ఇటీవలే అరకు, మండపేట అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించగా… రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని 26న పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు.

          టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు జరగకుండానే పొత్తు సూత్రాలను టీడీపీ ఉల్లంఘించిందని పవన్ వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో జనసేన అధి నేత మాట్లాడుతూ, మండపేట, అరకు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత జనసేన రాజోలు, రాజా నగ రం రెండు స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించాల్సి వచ్చింద న్నారు. టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో జనసేన నేత ల్లో ఆందోళనకు గురయ్యారని, వారికి క్షమాపణలు చెబుతున్నానని పవన్ అన్నారు. చంద్రబాబు మాది రిగానే తాను కూడా తన పార్టీ కార్యకర్తల నుండి ఒత్తిడికి గురవుతున్నానని, తనను కూడా అర్థం చేసుకుంటారని పవన్ అన్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా దాదాపు మూడో వంతు స్థానాల్లో జనసేన పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో నాకు తెలుసు అని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పొత్తు ముగిసి పోదని, అంతకు మించి కొనసాగుతుందని పవన్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కొన్ని వ్యాఖ్యలు చేసినపుడు తాను మౌనం వహించానని అన్నారు. ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాను మౌనంగా ఉన్నట్టు చెప్పారు. అవసరమైతే తమ పార్టీ ఒంటరిగా పోటీ చేసి సీట్లు గెలుచుకోవచ్చని, కాకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే శక్తి లేకపోవచ్చని జనసేన అధినేత అన్నారు. మొత్తానికి టీడీపీ , జనసేన పొత్తు ఏపీ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించడానికి సిద్ధంగా ఉందని జనసేన అధిననేత స్పష్టం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్