పారిశ్రామిక వేత్తలలో లెజెండ్.. రతన్ టాటా. ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు. వర్థమాన పారిశ్రామికవే త్తలకు మార్గనిర్దేశం చేసే రతన్ టాటాకు ఓ యంగ్ ఫ్రెండ్ తో దోస్తీ కుదిరింది. ఆ యంగ్ అసిస్టెంట్.. మిలీనియల్ దోస్త్… పేరు శాంతను నాయిడు… ఎవరీ శాంతను.. అసలు దోస్తీ ఎలా కుదిరింది.. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ.. ఈ కథనం చూడాల్సిందే.
టాటా పారిశ్రామిక సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత రతన్ టాటా. అలాంటి లెజెండ్ 84వ బర్త్ డే.. అనగానే.. విలాసవంతమైన హోటళ్లలో.. వీఐపీలతో అంగరంగ వైభవంగా జరుగుతుందని ఊహిస్తాం. కానీ ..డిసెంబర్ 28న… చాలా సింపుల్ గా.. పుట్టినరోజు జరుపుకున్నారు. ఓ చిన్న కప్ కేక్.. ఓ క్యాండిల్.. రతన్ టాటా.. యంగ్ బిజినెస్ అసిస్టెంట్.. శాంతను నాయుడు.. అంతే.. అపూర్వ రీతిలో ఎంజాయ్ చేస్తూ.. పుట్టినరోజు సెలబ్రేటే చేసుకున్నారు.. రతన్ టాటా.
రతన్ టాటా బర్త్ డే సెలబ్రేషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పక్కనే కూర్చొని రతన్ టాటా భుజంపై చేయి వేసి కప్ కేక్ తినిపించిన శంతను నాయుడు ను ప్రపంచం ఆసక్తి కరంగా చూసింది. ఎవరీ యంగ్ హీరో.. అని ఆరా ఆరంభించింది. ఆ అపూర్వ తాతా- మనుమడి అనుబంధం చూసి లోకం ఆశ్చర్య పోయింది.శాంతను నాయుడు.. 1993లో మహారాష్ట్రలోని పుణేలో పుట్టాడు. కార్నెల్ యూనివర్సీటీ లో ఎంబీఏ చేశాడు. 2017 జూన్ నుంచి టాటా ట్రస్ట్ లో పనిచేస్తున్నాడు. టాటా ఎల్క్సీ లో డిజైన్ ఇంజినీర్ గా కూడా పనిచేశాడు. 28 ఏళ్ల యువకుడు ఎంతో మందికి కలలుకనే బిజినెస్ ఇండస్ట్రీలో కీలక స్థానం సాధించాడు. స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజం రతన్ టాటాకు శాంతను బిజినెస్ టిప్స్ ఇచ్చాడంటే.. ఆశ్చర్యం కలగక మానదు. శాంతను ప్రసిద్ధ భారతీయ వ్యాపార వేత్త. ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్, డిజీఎం, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్. పారిశ్రామికవేత్త.. అంతే కాదు.. ఓ రచయిత.. ప్రస్తుతం టాటా ట్రస్ట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శాంత నాయుడు.
రతన్ టాటా జంతు ప్రేమికుడు. చిన్నతనంలోనే పెంపుడు కుక్కలను పెంచుకున్నారు. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. 1945లో తన 12వ ఏట తాను, సోదరుడు జిమ్మీ పెంపుడు కుక్కతో ఉన్న ఫోటో ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అలా ఫేస్ బుక్ చూస్తుండగా శాంతను వీధి కుక్కల కోసం రిఫ్లెక్టర్లతో తయారు చేసిన డాగ్ కాలర్ల గురించి రాసిన పోస్ట్ పారిశ్రామిక దిగ్గజాన్ని ఆకర్షించింది. ఈ డాగ్ కాలర్ల ద్వారా వాహనాల డ్రైవర్లు.. ముంబై రోడ్లపై వీధి కుక్కలను గుర్తించవచ్చునని.. ఫలితంగా వీధి కుక్కలు కార్ల కింద పడి చనిపోకుండా రక్షించవచ్చునని చేసిన పోస్ట్ చేశాడు. శాంతను తోటి విద్యార్థులతో కలిసి, ఇళ్లనుంచి డెనిమ్ ప్యాంట్లు సేకరించి, పుణేలో 500 రిఫ్లెక్టర్ కాలర్లు తయారు చేసి వీధికుక్కలకు వేశారు. ఆ పోస్ట్ రతన్ టాటాను కదిలించింది. ఆయన శాంతనును ఓ సమావేశానికి ఆహ్వానించడం.. అతడి ఆలోచన, చిత్తశుద్ధి, అతడి మాటలకు ముగ్ధుడవడంతో.. రతన్ టాటాకు ఎంతో ప్రీతిపాత్రు డయ్యాడు. 2016లో శంతను నాయుడు అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివాడు. డిగ్రీ పూర్తి చేసి 2018లో తిరిగి వచ్చాక చైర్మన్ కార్యాలయంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ టాటా ట్రస్ట్ లో చేరాడు. రతన్ టాటాతో తన అనుబంధానికి అద్దం పడుతూ.. “ఐ కేమ్ అపాన్ ఏ లైట్ హౌస్” అనే పుస్తకాన్ని కూడా రాశాడు శాంతను. దేశాభివృద్ధి లో స్టార్టప్స్ వ్యవస్థపై రతన్ టాటాకు అపారమైన నమ్మకం. ఆయన ప్రోత్సాహంతో ఎన్నో స్టార్టప్ కంపెనీలు వృద్ధి పొందాయి. శాంతను నాయుడు తన ఐడియాలతో, పనితనంతో పలు స్టార్టప్ లలో వ్యక్తిగత పెట్టుబడులకు రతన్ టాటా సూచనలు చేసి ఆయన హృదయాన్ని గెలుచుకున్నాడు. భవిష్యత్ లో టాటా పారిశ్రామిక సామ్రాజ్యానికి కొత్తవారసుడు ఇతడేనేమో.


