టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు రెడ్ బుక్ బెదిరింపుల కేసు నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుం ది. ఈ కేసులో కోర్టు ఆదేశాలానుసారం సీఐడీ, లోకేష్‌కు నోటీసులు పంపారు. దీంతో ఇవాళ ఆయన కోర్టుకు హాజరవుతా రా? లేదా? అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోలిపల్లిలో జరిగిన యువగళం ముగింపు సభలో రెడ్ బుక్ తో కనిపిం చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని వేధించిన వారి పేర్లను ఇందులో రాస్తున్నానని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి సంగతి తేలుస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సీఐడీ..లోకేష్ కు నోటీసులు జారీ చేసింది. గత నెలలో ఏసీబీ కోర్టులో సీఐడీ ఒక మెమో దాఖలు చేసింది. లోకేష్‌కి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ.. ఆధారాలతో సహా పిటిషన్లో సీఐడీ కోరింది. దీంతో తమ ముందు హాజరై స్వయంగా హాజరైగానీ లేదంటే న్యాయవాది ద్వారాగానీ వివరణ ఇవ్వాలని కోర్టు లోకేష్‌ను ఆదేశించింది.


