నేటితో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగిసింది. తెలంగాణలో ఖాళీ అయిన మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరా రు చేశారు. కాంగ్రెస్ నుంచి రేణుకాచౌదరి, అనిల్ కుమార్ యాదవ్.. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఇవాళ నామినేషన్ వేశారు. వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభ స్థానానికి కేసీఆర్ నామినేట్ చేశారు. పార్టీ సీనియర్ నేతలతో చర్చించి రవిచంద్ర అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. రవిచంద్ర ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. భారత ఎన్నికల సంఘం తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తోంది, వీటికి ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ పత్రాల దాఖలుకు ఇవాళ చివరి తేదీ.
బీఆర్‌ఎస్ ఎంపీలు జే సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుండడంతో మూడు స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఖాళీగాఉన్న మూడు స్థానాల్లో కాంగ్రెస్ రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించగా, అసెంబ్లీలో తమకున్న బలం ఆధారంగా బీఆర్‌ఎస్ మూడో స్థానం కోసం పోటీ చేయాలని నిర్ణయించుకుంది. వద్దిరాజు రవిచంద్ర తెలంగాణకు చెందిన గ్రానైట్ వ్యాపారవేత్త. ఆయన 2019లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరాడు. రవిచంద్రను 2022 బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఖరారు చేసింది. ఈ రాజ్య సభ ఉప ఎన్నికలో ఒకనామినేషన్ దాఖలు కావడంతో రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. రాజ్యసభ నామినేషన్ల గడువు ఇవాళ్టితో ముగియనుంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఇందులో తెలంగాణ నుంచి మూడు ఖాళీలు ఉన్నాయి.