భువనగిరి హాస్టల్‌లో బాలికల ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. బాలికలు ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నా.. తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలికల పోస్టుమార్టం రిపోర్టు బయటపె ట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో ఆరుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్దరు విద్యార్థినిల ఆత్మహత్య కలకలంరేపింది. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్‌లో పదోతరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన బాలికలు హాస్టల్‌లో ఉంటూ భువనగిరిలోని రెడ్డివాడ బాలికోన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నారు.రోజూలాగే శనివారం స్కూల్‌కు వెళ్లిన విద్యార్థినులు తిరిగి సాయంత్రం హాస్టల్‌కు వచ్చారు. వీరిద్దరు హాస్టల్‌లో ట్యూషన్‌కు వెళ్లలేదు..ట్యూషన్ టీచర్ పిలిస్తే రాత్రి భోజనం చేశాక వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. భోజనం సమయంలో కూడా వారు రాకపోవడంతో ఓ విద్యార్థిని అనుమానంతో గది వద్దకు వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరు విద్యార్థినులు రెండు ఫ్యాన్లకు ఉరేసుకొని ఉన్నారు. తమ పిల్లలది ఆత్మహత్య కాదని.. అనుమానం వ్యక్తం చేస్తూ హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.