మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చక్రబంధంలో చిక్కుకున్నారు. భారత్‌తో దౌత్య సంబంధాలు దెబ్బ తినడంతో అందుకు కారకుడు దేశధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జేనన్న అభిప్రాయం ఆ దేశంలో నెలకొంది. సామాన్య ప్రజానీకంలో ఈ అభిప్రాయం బలంగా వేళ్లూనుకుంది. భారత్‌తో సంబంధాలు దెబ్బతినడంపై మాల్దీవుల్లోని ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు భారతీయులందరికీ మహమ్మద్ ముయిజ్జు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష నేత ఖాసీం ఇబ్రహీం డిమాండ్ చేశారు. మాల్దీవుల ప్రయోజనాలను పణంగా పెడుతు న్నారని మహమ్మద్ ముయిజ్జుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అనేకసార్లు తమను ఆదుకున్న భారత్‌ను పక్కన పెట్టి, చైనా అనుకూల వైఖరి తీసుకుందని మహమ్మద్ ముయిజ్జు సర్కార్‌పై నిప్పులు చెరిగాయి మాల్దీవుల్లోని ప్రతిపక్షాలు. ఒక దశలో మహమ్మద్ ముయిజ్జు సర్కార్‌పై అభిశంసన తీర్మానం చేయడానికి కూడా ప్రతిపక్షాలు సిద్ధపడ్డాయి. పొరుగు దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు ప్రభావితం అయ్యేలా దేశాధ్యక్షుడు మOpposition to Mohammed Muizzu’s Apologyహమ్మద్ ముయిజ్జు మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు ఖాసీం ఇబ్రహీం.
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఇటీవల చైనాలో పర్యటించారు. చైనా పర్యటన తరువాత భారత దేశానికి, భారత ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మహమ్మద్ ముయిజ్జు కొన్ని వ్యాఖ్యలు చేశారు. భౌగోళికంగా మాల్దీ వులు చిన్నదేశమే కావచ్చు. అంతమాత్రాన మమ్మల్ని ఎవరూ బెదిరిస్తామని అనడం సమంజసం కాదు. మాల్దీవులను బెదిరించడానికి ఏ దేశానికీ లైసెన్స్ ఇవ్వలేదు …అంటూ మహమ్మద్ ముయిజ్జు వ్యాఖ్యానించారు. అన్యాపదేశంగా భారతదేశాన్ని ఉద్దేశిస్తూ మహమ్మద్ ముయిజ్జు ఈ వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ ముయిజ్జు చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల్లోనూ దుమారం రేపాయి. మాల్దీవుల్లోని సామాన్య ప్రజలు కూడా మహమ్మద్ ముయిజ్జు చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అవసరాల్లో ఆదుకున్న భారతదేశాన్ని కించపరిచేలా మహమ్మద్ ముయిజ్జు వ్యాఖ్యానించి ఉండాల్సింది కాదని ప్రతిపక్షాలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో భారతదేశానికి మాల్దీవులు అధికారికంగా క్షమాపణలు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
భారత్‌కు వ్యతిరేకంగా అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చేసిన వ్యాఖ్యలను మాల్దీవుల్లోని ప్రతిపక్షాలు తీవ్రంగా పరిగణించాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య దూరం పెంచాయి. ఈ నేపథ్యంలో ఒక దశలో పార్లమెంటులో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కథ అక్కడితో ఆగలేదు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య కొట్లాట కూడా జరిగింది. మాల్దీవుల పార్లమెంటులోని ముష్టిఘాతాల సన్నివేశాలను యావత్ ప్రపంచం చూసింది. ఇదిలా ఉంటే, భారత ప్రధాని నరేంద్ర మోడీని కించపరుస్తూ వ్యాఖ్యానించిన ముగ్గురు మంత్రులు మరియం షియూనా, మల్షా షరీఫ్, అబ్దుల్లా మజూం మాజిద్‌లకు వ్యతిరేకంగా మాల్దీవుల పార్లమెంటు ఓటు వేసింది. మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం ఇక ఆ ముగ్గురు మంత్రుల పదవులు ఊడినట్లే. చివరకు భారత్‌కు వ్యతిరేకంగా నోరు పారుసుకున్నందుకు ముగ్గురు మాల్దీవుల మంత్రులకు పదవులు ఊడాయి.
భారత్‌తో వివాదం తలెత్తిన నేపథ్యంలో బాయ్‌కాట్ మాల్దీవ్స్ నినాదం తెరమీదకు వచ్చింది. పర్యాటకపరంగా మాల్దీవులను బహిష్కరించాలన్నదే ఈ నినాదం ముఖ్యోద్దేశం. హిందూ మహాసముద్రంలోని కొన్ని ద్వీపాల సమూహమే మాల్దీవులు. భారత్‌లోని కొచ్చి నగరానికి 820 కిలోమీటర్ల దూరాన మాల్దీవులు ఉంటాయి. అందమైన బీచ్‌లకు మాల్దీ వులు పెట్టింది పేరు. మాల్దీవ్స్ ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. మాల్దీవ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు వస్తుం టారు. అయితే అత్యధికంగా భారత్ నుంచే వస్తుంటారు. అనేక దశాబ్దాల నుంచి అన్నిటికీ భారత్‌పై ఆధారపడుతోంది మాల్దీవ్స్. భారత్‌కు దౌత్యపరమైన వివాదం తలెత్తడంతో మాల్దీవులకు పర్యాటకుల సంఖ్య తగ్గుతోంది. ప్రతి నిత్యం భారత్ నుంచి వచ్చే టూరిస్టులు తగ్గడం మొదలైంది. దీంతో మాల్దీవులకు పర్యాటకపరంగా వస్తున్న ఆదాయం తగ్గింది. మాల్దీవులకు నిన్న మొన్నటివరకు భారత్ నుంచి వచ్చే టూరిస్టులు నెంబర్ ఒన్ స్థానంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం సీన్ మారిపోయింది. మాల్దీవులకు వచ్చే విదేశీ టూరిస్టుల్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. మొత్తానికి మహ మ్మద్ ముయిజ్జు నోటిదురుసుతనమే మాల్దీవులను రోడ్డున పడేలా చేసింది.


