కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ‘రా కదిలి రా’ ప్రచార రథాలను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారా యణరావు, జనసేన నేత బండి రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. టీడీపీ, జనసేన ఉమ్మడిగా నిర్వహిస్తున్న ‘రా కదలి రా’ కార్యక్రమం ద్వారా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నట్లు టీడీపీ, జనసేన నేతలు తెలిపారు. ‘రా కదలి రా’ కార్యక్రమం ద్వారా జైత్రయాత్రకు శ్రీకారం చుట్టామన్నారు. కనిగిరిలో ప్రారంభమైన ‘రా కదలి రా’ సభలకు ప్రజలు లక్షలాదిగా తరలివస్తున్నారన్నారు. జయహో బీసీ కార్యక్రమం ద్వారా రాబోయే టీడీపీ ప్రభు త్వంలో బీసీలకు చేసే కార్యక్రమాలను వివరిస్తున్నామన్నారు. జగన్‌ని తరిమికొట్టడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యం అన్నారు.


