కేంద్రలో బీజేపీ సుస్థిర స్థానాన్ని దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో విపక్షాలన్నీ ఇండియా కూటమి గా ఏర్పాటయ్యాయి. అయితే మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆప్ పార్టీలు దూరమయ్యాయి. అదే దారిలో బీహార్ సీఎం నితీష్ కుమార్ సారధ్యంలో జేడీయూ కూడా ఇండియా కూట మికి గుడ్ బై చెప్పింది. అదేవిధంగా మిత్రపక్షాల మధ్య కూడా విభేదాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో భాగమైన డీఎంకీ అధినేత తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బీజేపీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలి పోకుండా సమైఖ్యతతో ముందుకు సాగాలని ఇండియా కూటమి నాయకులను స్టాలిన్ కోరారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని మళ్లీ అధికారం రానివ్వకూడదనే ఆశయంతో విపక్షాలు ,మిత్రపక్షాలు పని చేయాలని స్టాలిన్ అన్నారు. ప్రతి ఒక్కరు అదే లక్ష్యంతో పని చేయాలని కోరారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండా జాగ్రత్త పడాలని సూచించారు. దేశంలో మళ్లీ బీజేపీ వస్తే ప్రజాస్వామ్యం , ఫెడరలిజం ఉండవని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమిళనాడు తిరుచురాపల్లిలో జరిగిన ఓ సమావేశంలె తమిళనాడు సీఎం స్థాలిన్ తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో ఇప్పటికే ఒక అయోమయ పరిస్థితి నెలకొంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామనడంతో ఇండియా కూటిమికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కూటమిలో సీట్ల పంపకాలపై కాంగ్రెస్ , టీఎంసీల మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మమత బెనర్జీ కూటమికి దూరమయ్యారు. ఆమె ఈ ప్రకటన చేసిన రోజునే పంజాబ్ హర్యాలోని అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తాం అని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రకటించింది. దీంతో కూటమిలోని ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ కు గట్టి దెబ్బే తగిలింది. అసలే మూలిగే నక్క మీద తాటి కాయ పడిన చందాన మరో వైపు బీహార్ నేత నితీష్ కుమార్ కూటమికి దూరం కావడంతో మరింత అనిశ్చిత పరిస్థితి నెలకొంది.