అసెంబ్లీ ఎన్నికలు తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా పదేళ్లలో ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదని చెప్పారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ప్రాజెక్టులు అప్పగించాలని లేదంటే నోటిఫై చేస్తామని బెదిరించారని చెప్పారు. కావా లంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకోవాలని.. ప్రభుత్వాన్ని రద్దు చేస్తా.. తెలంగాణకు అన్యాయం చేస్తా అంటే ఊరుకోను అని చెప్పానన్నారు. ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని ఆనాడే చెప్పానని చెప్పారు. తనను వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ పార్టీని కొత్త సీఎం ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని మండిపడ్డారు కేసీఆర్. తనను.. బీఆర్ఎస్ పార్టీని టచ్ చేయడం కొత్త సీఎంకు చేతకాదని…ఇంత కంటే హేమాహేమీలనే ఎదుర్కొన్న చరిత్ర తమకు ఉందన్నారు కేసీఆర్. రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపాడుకు న్నామన్న కేసీఆర్…దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడూ వెనక్కువెళ్లలేదని గుర్తు చేశారు…ఉడుత బెదిరింపులకు తాను భయప డనన్నారు. ముందు ముందు ఎలా ఉంటుందో చూద్దామన్న కేసీఆర్. ..తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో తనకు బాగా తెలుసన్నారు.