18.7 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

ప్రతిపక్ష నేతలపై వైఎస్ఆర్ సీపీ మైండ్ గేమ్

  ప్రతిపక్ష పార్టీ నేతలపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కుట్రలకు తెరలేపింది. ప్రతిపక్ష పార్టీ నేతలు లక్ష్యంగా మైండ్ గేమ్ ఆడుతుంది. ఇతర పార్టీల నుంచి భారీగా నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారంటూ లీకులిస్తుంది వైసిపి. వున్న పార్టీలో వారిపై అనుమానా లు క్రియేట్ చేస్తూ, రాజకీయ భవిష్యత్ పై దెబ్బ కొడుతుంది. దీంతో ఆయా పార్టీల నేతలు తాము పార్టీ మారబోము అంటూ మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి కల్పిస్తుంది.

   ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్షాలను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగా ప్రతిపక్ష పార్టీల్లో బలమైన, కీలకమైన నేతలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఒక వేళ ఎవరైనా వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపకపోతే అలాంటి నేతలపై మైండ్ గేమ్ కు తెరలేపుతుంది వైసిపి. టిడిపి నుంచి భారీగా వైసీపీలోకి చేరేందుకు నేతలు సిద్ధమవుతున్నారంటూ మీడియాకు లీక్ ఇస్తుది వైసిపి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో సామాజికంగా, రాజకీయంగా బలమైన నేతలుగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని ఇలాంటి ప్రచారాలకు తెరలేపింది. మచిలీపట్నం మాజీ ఎంపీ బిసి సామాజిక వర్గానికి చెందిన కొనకళ్ళ నారాయణ త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని వైసీపీ సోషల్ మీడియా వెబ్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. కొనకళ్ళ నారాయణ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు . మచిలీపట్నం నుంచి రెండుసార్లు టిడిపి తరఫున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో నారాయణ పై వైసీపీ అభ్యర్థి బాలశౌరి విజయం సాధించారు.బాలశౌరి తాజాగా వైసీపీ కి రాజీనామా చేశారు. జనసేన పార్టీలో చేరారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మచిలీపట్నం నుంచి పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి దొరకడం లేదనే వాదన వైసీపీ వర్గాల్లో వినిపిస్తుంది.

    ప్రస్తుతానికి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నీ మచిలీపట్నం పార్లమెంటు ఇన్చార్జిగా నియమించింది వైసిపి.  అయితే వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధిని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని జగన్ గతంలో సూచించారు. అయితే అందుకు సారధి నిరాకరిం చడంతోపాటు తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సరైన నేత లేకపోవడంతో టీడీపీ నేత కొనకళ్ళ నారాయణను అధికార వైసిపి నేతలు టార్గెట్ చేశారు. ఆయన పార్టీ మారతారు అంటూ ప్రచారాన్ని వైసిపి నేతలు ముమ్మరం చేశారు. అయితే తాను వైసీపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు స్పందించారు. ఇది కేవలం వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారమన్నారు.తనకు పార్టీ మారే ఆలోచన లేదని, భవష్యత్తులో కూడా రాదన్నారు. తమ క్రెడిబులిటీతో ఆడుకోవద్దని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని సున్నితంగా హెచ్చరించారు.

   మరోవైపు కర్నూలు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత కుటుంబం కూడా త్వరలో వైసీపీలో చేరే అవకాశం ఉందని వైసీపీ నేతలు ప్రచారం చేస్తూన్నారు. 2014 ఎన్నికల్లో గౌరు చరిత పాణ్యం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో గౌరు చరితకు వైసిపి టికెట్ నిరాకరిం చడంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీని జిల్లాలో బలోపేతం చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారు. తాజాగా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో గౌరు చరిత కుటుం బం వైసీపీలో చేరే అవకాశం ఉంది అనే ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చింది వైసిపి. అలాగే కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలతో పాటు కొందరు టిడిపి కీలక నేతలు సైతం త్వరలో వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారాన్ని మొదలుపెట్టారు అధికార పార్టీ నేతలు. ఈ ప్రచారాలపై ఆ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్