పాకిస్థాన్ లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ఫలితాల కారణంగా దేశంలో తలెత్తిన రాజకీయ అస్థిరత నేపథ్యంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు చెందిన పిఎంఎల్ -ఎన్ పార్టీ బిలావల్ భుట్టో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ … ప్రధాని పదవి రొటేషన్ పద్ధతిన పంచుకునే ప్రతిపాదనతో ప్రభుత్వం ఏర్పాటుకు సూత్ర ప్రాయంగా అంగీకరించారు. ముఖ్యమైన అంశాలపై ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. మరో పక్క ఎన్నికల ఫలి తాల్లో అవకతవకలపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి. పాకిస్థాన్ ముస్లీం లీగ్ – నవాజ్ పార్టీ.. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ప్రధాని పదవి చెరో రెండున్నర ఏళ్లు పంచుకునే ప్రతిపాదన పై సంకీర్ణప్రభుత్వం ఏర్పాటుకు గల అవకాశాలను చర్చిస్తున్నాయి. నవాజ్ షరీఫ్ తానే ప్రధాని గా ఉండేందుకు సిద్ధమయినా. పిపిపీ బిలావల్ తమ ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది. పిపిపి ముందు ప్రధాని పదవి తమకే దక్కాలని కోరుతోంది. నవాజ్ షరీఫ్ కు ముందుగా ప్రధాని పదవి ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడంతో నవాజ్ షరీఫ్ ఊగిసలాడుతున్నారు. పాకిస్థాన్ సైన్యం కూడా నవాజ్ షరీఫ్ ప్రధాని పదవి చేపట్టాలని కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పాకిస్థాన్ పార్లమెంటు ఎన్నికల ఫలితాలను ప్రకటించగా దాదాపు 101 స్థానాల్లో ఇండిపెండెంట్లే నెగ్గారు. వారిలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతు గల ఇండిపెండెంట్లే ఎక్కువ. నవాజ్ షరీఫ్ పిఎంఎల్- ఎన్ పార్టీ 75 స్థానాల్లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ పార్లమెంటేరియన్స్ – 54 స్థానాలు గెలుచుకున్నాయి. ఇతరపార్టీల్లో ఎంక్యూఎం 17, పిఎంఎల్ 3, జెయుఐపి 4, ఐపిపి 2, బిఎన్పి 2 స్థానాలు గెలుచుకున్నాయి. ఇంకా చిన్నా చితక పార్టీలు 1,2 ఎంపీస్థానాలను గెలిచాయి. ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం జరిగితే.. సైనిక జోక్యం తప్పకపోవచ్చునని పాక్ ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చర్చల్లో పిపిపి ప్రెసిడెంట్ అసిఫ్ అలీ జర్దారీ, చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ, పిఎంఎల్ -ఎన్ తరుపున మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చర్చల్లో పాల్గొన్నారు. చర్చలు ఓ కొలిక్కి రాలేదు. చిన్న పార్టీ ఎంక్యూఎం కూడా భవిష్యత్ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం ఏర్పాటుతోపాటు, పాకిస్థాన్ లో మొత్తం రాజకీయ పరిస్థితిపై అంచనావేయడంతోపాటు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపైన, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు వంటి పలు అంశాలపై చర్చ జరుగుతుంది.


