స్వతంత్ర వెబ్ డెస్క్:
మేషం
ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. అదృష్టం వరిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తిస్తారు. అర్థలాభం ఉంది. వ్యాపారంలో ఆర్ధికంగా ఎదుగుతారు. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
వృషభం
ప్రారంభించిన పనులు పనులు క్రమంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.సూర్యాష్టకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.
మిథునం
చేపట్టే పనిలో ఆటంకాలు ఉన్నాయి. చంచలబుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసర విషయాల గురించి సమయాన్ని వృథా చేయకండి. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. నూతన వస్తు, ఆభరణాలు సేకరిస్తారు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
కర్కాటకం
సందర్భానుసారంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి వింధు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికమవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం సూచితం. మానసిక ప్రశాంతత కోసం లక్ష్మీ సందర్శనం ఉత్తమం.
సింహం
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అలసట పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఎప్పటినుంచో మీరు చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. మహాలక్ష్మి అష్టోత్తరం చదవడం వల్ల మంచి జరుగుతుంది.
కన్య
శుభకాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది.ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. బంధు,మిత్రులను కలుస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
తుల
మిశ్రమ కాలం. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. మీ పనితీరుతో అధికారులు సంతృప్తి పడక పోవచ్చు. అస్థిరనిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. విష్ణు ఆరాధన శుభప్రదం.
వృశ్చికం
ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది.
ధనుస్సు
మంచి కాలం. ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది. విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉంటాయి. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. ఇష్టదైవ ప్రార్థన మరింత మేలు చేస్తుంది.
మకరం
ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాలను రాబట్టడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. కుటుంబకలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించకుండా చూసుకోవాలి. భోజన నియమాలను పాటించడం ఉత్తమం. శ్రీవారి దర్శనం శుభకరం.
కుంభం
బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలంతో ఆపదల నుంచి బయటపడతారు. మీ శ్రమ వృథా కాదు. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్యబాధలుండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థికయోగం శుభప్రదం. సూర్య ఆరాధన శుభదాయకం.
మీనం
కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. బంధువులతో మాటపట్టింపులకు పోవద్దు. శని శ్లోకం చదవాలి.