ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది. ప్రతిపక్షం అయిన టీడీపీ- జనసేన కూటమి నుండి పవర్‌లోకి వచ్చేందుకు కూటమి పక్కా వ్యూహాలతో ముందుకు వెళు తోంది. ఈ క్రమంలోనే ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికారికంగా పార్టీలో చేరకున్నా వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధికి టీడీపీ సీటు ఖరారయ్యిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే పార్థసారధి పసుపు కండువాతో ప్రజల్లోకి వచ్చి, తానే నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నని స్వయంగా తన సీటు విషయాన్ని ప్రకటించారు.
ఏలూరు జిల్లా కేంద్రంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటైంది. ఉంగుటూరు, కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, నూజివీడు, చింతలపూడి శాసనసభ స్థానాలు ఈ నియో జకవర్గంలో ఉన్నాయి. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధిగా తన గెలుపు సునా యాసమంటున్నారు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి. పార్టీ పరంగా నూజివీడు సీటు ఖరారైన నేప థ్యంలో తొలిసారిగా నూజివీడులో పర్యటించారు. నియోజకవర్గ ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశాలతోపాటు మండల, గ్రామ పార్టీ అధ్యక్షుల్ని కలుస్తున్నారు. స్థానిక నేతల ఇళ్లకు వెళ్లి స్వయం గా మద్దతు కోరుతున్నారు. నియోజకవర్గంలో టీడీపీ అభివృద్ధికి గత పదేళ్లుగా ముద్దరపోయిన వెంకటే శ్వరరావు చేసిన కృషి మరువలేనిదన్నారు పార్ధసారధి.
ఏలూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధికి ఈసారి వైసీపీ టికెట్ నిరాకరించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను కాదని మంత్రి జోగి రమేష్ కు పెనమలూరు వైసీపీ ఇంచార్జీ బాధ్యతలు అప్పగిం చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన పార్థసారథి టీడీపీలో చేరారు. తాను నూజివీడు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీచే స్తున్నాని, టికెట్ కూడా ఖరారయ్యిందని పార్ఠసారథి ప్రకటిం చిన విషయం తెలిసిందే. అందుకే మాజీ మంత్రి పార్ఠసారధి మొదటిసారి పసుపు కండువా వేసుకుని నూజివీడులో పర్యటించారు. నూజివీడు నియోజకవర్గంలో వైసీపీ బలం గా ఉన్నప్పటికీ ప్రజల ఆలోచన ల్లో చాలా మార్పు వచ్చిందని పార్థసారథి అభిప్రాయపడ్డారు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను ఎగురవేస్తామని పార్థసారధి వెల్లడిం చారు. నూజివీడు నియోజకవర్గంలో మండల, గ్రామ స్థాయి టీడీపీ అధ్యక్షులను స్వయంగా కలుస్తు న్నారు పార్థసారథి. అంతేకాదు స్థానిక నేతల మద్దతు కూడగట్టారు. వైసీపీ దూరం పెట్టిన పార్ధ సారధిని టీడీపీ దగ్గరకు తీసుకోవడం టీడీపీకి ఎంతమేరకు లాభం చేకూరుతుందో వేచిచూడాల్సిందే.


