అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు డ్రోన్లు, 10 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలతో ఉత్తర్ప్రదేశ్ పోలీసులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సమీపంలో ఏదైనా అనధికార డ్రోను కనిపిస్తే వెంటనే స్పందించేలా యాంటీ – డ్రోన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సెక్యూరిటీ ఎస్పీ గౌరవ్ బంస్వాల్ తెలిపారు. పోలీసు దళాలకు సాయపడేలా ప్రపంచ అత్యాధునిక సాంకేతిక పరికరాలను అందుబాటులో ఉంచుతు న్నట్లు శాంతిభద్రతల డీజీ ప్రశాంత్ కుమార్ చెప్పారు. అయోధ్యకు వచ్చే మార్గాల్లో ఆక్రమణలన్నీ తొలగించి పరిశుభ్రం చేసినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సూచనలు అందజేస్తామని.. రైల్వేస్టేషను, బస్ స్టేషన్లలో అదనపు బలగాల పహారా ఉంటుందని డీజీ వివరించారు.


