సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖం మోగించిన టీడీపీ-జనసేన సీట్ల సర్థుబాటు.. ఓ కొలిక్కి వచ్చేసింది. ఇరు పార్టీల మధ్యా పొత్తు ఉండడంతో త్యాగాలు తప్పవని గతంలోనే ప్రకటించిన రెండు పార్టీల అధినేతలూ ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతోపాటు మేనిఫెస్టోను ప్రకటించనున్నారు టీడీపీ జనసేన అధినేతలు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈనెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావచన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. ఓవైపు వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల నియామకం జోరుగా సాగుతుంటే టీడీపీ- జనేసేన కేండిడేట్ల ప్రకటన ఎప్పుడు ఉంటుందన్న ప్రశ్న గత కొంతకాలంగా పార్టీ నేతల్లోనే ఎక్కువగా విన్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీట్ల సర్థుబాటు, అభ్యర్థుల ఖరారుపై టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడిగా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఎన్నికల వేళ రా.. కదలిరా పేరుతో వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. నాలు గు రోజుల పాటు వాటికి విరామం ఇచ్చి మరీ ఏయే స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలి… ఏయే సీట్లను జనసేనకు కేటా యించాలి అన్నదానిపై మొదటగా ఓ నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో జనసేనాని పవన్ సైతం తన కార్యక్ర మాలన్నింటినీ పక్కనపెట్టి మరీ నాలుగు రోజుల పాటు ఇవే అంశాలపై సుదీర్ఘంగా కసరత్తులు మొదలు పెట్టారు. పొత్తులో భాగంగా జనసేన కోసం ఏయే సీట్లను టీడీపీ అధినేతను డిమాండ్ చేయాలి.. ఎక్కడెక్కడ పోటీ నుంచి తప్పుకొని తెలుగుదేశానికి చోటు వదలాలి అన్న అంశాలపై ఓ అవగాహనకు వచ్చారు. చివరకు ఈనెల 4న ఉండవ ల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు జనసేనాని పవన్ కల్యాణ్. సుదీర్ఘంగా టీడీపీ అధినేతతో చర్చలు జరిపారు. ప్రధానంగా ఇరు పార్టీలు పొత్తులో ఉన్న నేపథ్యంలో జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలి.. అందులోనూ ఆయా సామాజిక వర్గాల వారీగా రెండు పార్టీలకు ఉన్న బలాబలాలను పరిగణలోకి తీసుకొని కొన్నిజిల్లాల్లో మెజార్టీ సీట్లు వచ్చేలా ఏ విధంగా ముందుకెళ్లాలి.. సీట్లు ఖరారైన తర్వాత అసంతృప్త నేతలను బుజ్జగించే అంశంతోపాటు ఉమ్మడి మేనిఫెస్టోపైనా ఇరువురు అధినేతలు విస్తృతంగా చర్చించారు. ఈ క్రమంలోనే తమ వద్ద ఉన్న జాబితాలపై ఇరుపార్టీల నేతలు పరస్పరం చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ భేటీ తర్వాత అటు చంద్రబాబు, ఇటు జనసేనాని పవన్ తమ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ సమా వేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన టీడీపీ అధినేత.. పవన్‌తో చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలను తెలుగుదేశం పార్టీఎమ్మెల్యేలతో పంచుకున్నారు. జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ప్రస్తుత సమయంలో కొందరికి సీట్లు దక్కకపోయినా అసంతృప్తి చెందవద్దని.. భవిష్యత్‌లో అవ కాశాలు కల్పిస్తామని నేతలకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు.. పవన్ కల్యాణ్ సైతం తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి జనసేన పార్టీలో చేరిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారా యన. పొత్తులు ఉన్నప్పుడు కొంత కష్టంగా ఉంటుందన్న పవన్.. సీట్ల సర్థుబాటు వేళ కొంతమందికి బాధ అనిపిస్తుం దని చెప్పుకొచ్చారు. గతంలో సీపీఐ, సీపీఎం, బీఎస్‌పీలతోనూ అనేక ఇబ్బందులు ఎదురయ్యాయన్న ఆయన… అన్నీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. జగన్ పాలనను మళ్లీ రాకుండా చూసేందుకు తాను సిద్ధంగా ఉన్నా నంటూ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు పవన్.అయితే.. జనసేన పార్టీలో బాలశౌరి చేరిక కార్యక్రమం ముగిసి న తర్వాత వెంటనే మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు పవన్. మళ్లీ అభ్యర్థుల ఖరారుపై సుదీ ర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలోనూ పలు విషయాలపై విస్తృతంగా చర్చించారు ఇరు పార్టీల అధినేతలు. చివరకు టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులను, జనసేన అభ్యర్థులు బరిలో ఉన్న సీట్లలో టీడీపీ ఆశావ హులకు నచ్చచెప్పాలని, రెండు పార్టీలు సమన్వయంతో ముందుకెళ్లేలా చూడాలని ఇద్దరు నేతలు నిర్ణయానికి వచ్చా రు. అయితే.. ఒకేరోజు రెండుసార్లు సుదీర్ఘంగా సమావేశమైన చంద్రబాబు, పవన్ … ఉమ్మడి అభ్యర్థులపై ఓ నిర్ణయా నికి వచ్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అతి త్వరలోనే మంచి రోజు చూసుకొని ఈ విషయంలో ఓ ప్రకటన చేస్తా రంటున్నారు ఇరు పార్టీల నేతలు. మరోవైపు.. టీడీపీ-జనసేన సీట్ల సర్థుబాటు చర్చలపై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు. వీళ్ల చర్చలు తేలేవి కావన్న ఆయన.. ముందు చంద్రబాబు, పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తేల్చుకో వాలని ఎద్దేవా చేశారు. మొత్తంగా ఈ విమర్శల సంగతి కాస్త పక్కన పెడితే… టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులపై త్వరలోనే ప్రకటన ఉంటుందన్న వార్తలతో ఇరు పార్టీల నేతల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది.