తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఏమీ రాలేదని అన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగినా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా సీఎం ఒక్క మాటా మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం ఎందుకు భయపడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు పణంగా పెడుతున్నారని ఆరోపించారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.


