తిరుపతి జూపార్క్ లో విషాదం చోటు చేసుకుంది. లయన్ జోన్ లోకి వెళ్లిన వ్యక్తిని సింహం చంపేసింది. తిరుపతి జూపార్క్‌లో విషాదం చోటు చేసుకుంది. శ్రీ వేంకటేశ్వర జులాజికల్ పార్క్ సంద ర్శనకు వెళ్లిన ఓ వ్యక్తి ఎవరూ గుర్తించని సమయంలో లయన్ ఎన్‌క్లోజర్‌లోకి చొరబడ్డాడు. సుందరి, కుమార్, దొంగలపూర్ అనే రెండు మగసింహాలు ఒక ఆడ సింహం ప్రస్తుతం జూలో ఉన్నాయి. బోనులోకి దూకిన వ్యక్తిపై దొంగలపూర్ అనే సింహం దాడి చేసి చంపింది. లయన్ ఎన్ క్లోజర్‌లోకి ఆ వ్యక్తి ఎలా వెళ్లాడనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.ఈ తరహా ఘటనలు దేశంతో పాటు విదేశాల్లోని పలు జూపార్క్ లలో గతంలో చోటు చేసుకున్నాయి. జూపార్క్ లలో పులులు, సింహాలు, ఏనుగులు ఉన్న ప్రదే శాలకు మనుషులు వెళ్లకుండా జూపార్క్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే జూపార్క్ సిబ్బంది కళ్లుగప్పి కొందరు పులులు, సింహాలు తిరిగే ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడిన ఘటనలు కూడ లేకపోలేదు.