ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు వ్యూహా ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. కొత్త వాళ్లను స్వాగతిస్తూ పాత వాళ్ల ను దూరం చేసుకునే పరిస్థితుల్లో అన్ని పార్టీలు ఉన్నాయి. ఇదే దారిలో టీడీపీ కూడా గెలుపు గుర్రాలకు ప్రాధాన్యతను ఇస్తోంది.
టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని త్వరలో ఢిల్లీకి వెళ్లి తన లోక్ సభ సభ్యత్వంతో పాటు, తెలుగుదేశం పార్టీకిసైతం రాజీనామా చేస్తారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. కాగా మరో సంచలన ట్వీట్ చేశారు. తన కుమార్తె శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తుందని వెల్లడించారు. తన కూతురు కేశినేని శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి, తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారని నాని ట్వీట్ చేశారు. రాజీనామా ఆమోదం పొందిన తరువాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికికూడా రాజీనామా చేస్తారని తెలు స్తోంది. ఏపీలోని ద్విముఖ పోటీలో నువ్వా నేనా అంటూ ఇటు వైసీపీ అటు టీడీపీ గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టింది. దీంతో రెండు పార్టీలు సీనియర్ నేతలను దూరం చేసుకుంటున్నాయి. ఎవరి వ్యూహాలు ..ఎవరి ఎత్తుగడులు ఫలి స్తాయో వేచి చూఏడాల్సిందే.


