వరుస భూకంపాలతో జపాన్ చిగురుటాకులా వణికిపోయింది. ఒకేరోజు 155 సార్లకు పైగా భూ ప్రకంపనలు సంభవించా యి. ఇప్పటివరకు కచ్చితంగా ఎంతమంది చనిపోయారన్న లెక్క తేలడం లేదు . జపాన్‌లోని అనేక నగరాల్లో ఘోర మైన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వాజిమా నగరంలో ఎటుచూసినా కూలిపోయిన భవనాలే, కుప్పలుగా మృతదే హాలే. అయితే రోడ్లు ఘోరంగా దెబ్బతినడంతో సహాయక బృందాలుభూకంప బాధిత ప్రాంతాలకు సకాలంలో చేరుకో లేకపోతున్నాయి.
ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆనందిస్తున్న వేళ జపాన్‌లో ఘోర విపత్తు సంభవించింది. ఒకటికాదు…రెండు కాదు..ఒకేరోజు వరుసగా 155సార్లకు పైగా భూకంపాలు వచ్చాయి.భూకంపాల కారణంగా భారీ సం ఖ్యలో అగ్ని ప్రమాదాలు సంభవించాయి.ఈ అగ్ని ప్రమాదాల కారణంగా ఎంతోమంది చనిపోయారు. మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది.జపాన్వ్యాప్తంగా 45 వేల ఇండ్లకు పైగా కరెంటు సరఫరా నిలిపివేశారు.
తీర ప్రాంతమైన ఇషికావా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 7.6 తీవ్రతతో మొదట భూకంపం సంభవించింది. ఆ తరువాత వరుస భూకంపాలు సంభవించాయి. ఈ భూ కంపాల కారణంగా జపాన్‌లోని అనేక నగరాల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది.కొంతమంది నిద్రలోనే చనిపోయారు.బతికినవాళ్లు హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు.సాయం కోసం కేకలు వేస్తూ రోడ్లమీదకు పరుగులు తీశారు. ఎటుచూసినా గుండెలు పిండే దృశ్యాలే. హాహాకారాలు.ఆర్తా నాదాల తో జపాన్ దేశంలోని అనేక నగరాలు హోరెత్తాయి.
జపాన్‌లోని అనేక నగరాల్లో ఘోరమైన పరిస్థితి నెలకొంది. నీగట, టయామ్, గిఫూ నగరాల్లో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది.జపాన్‌లో వాజిమా నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. పర్యాటకరంగానికి వాజిమా నగరం కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. అలాంటి వాజిమా నగరంలో ఇప్పుడు ఎటుచూసినా కూలిపోయిన భవనాలే కనిపిస్తున్నాయి. శిధిలాల కింద మృతదేహాలు కనిపిస్తున్నాయి. కాగా శిథిలాల కింద ఇప్పటికీ అనేకమంది చావుతో పోరాడుతున్నారు. వీరిని రక్షించ డానికి సహాయక బృందాలు కాలంతో పోటీ పడుతున్నాయి. ఇదిలా ఉంటే భూకంపాల కారణంగా జపాన్వ్యాప్తంగా ఎంతమంది చనిపోయి ఉంటారన్నది కూడా లెక్క తేలడం లేదు.
భూకంపాల కారణంగా వాజిమా నగరంలోని అసైచీ వీథిలో భూకంపం కారణంగా పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం సంభ వించింది. ఈ ప్రాంతం కేవలం 280 చదరపు మీటర్ల లోపలే ఉండటంతో అగ్ని కీలలు అత్యంత వేగంగా విస్తరించా యి.మంటల ధాటికి 200 భవనాలు కాలిపోయాయి. అగ్నికీలల్లో చిక్కుకుని అనేకమంది చనిపోయారు. ఒక్క వాజిమా నగరంలోనే దాదాపు ఇరవై మంది చనిపోయార్న వార్తలందుతున్నాయి. వాజిమా నగరానికి వచ్చే ప్రధాన రహదారులన్నీ బీటలు మారాయి. దీంతో నగరంలో వాహనాలు కదలడం కష్టమైంది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. భూ కంపం కారణంగా జపాన్‌లోని ఒక ఎయిర్‌పోర్టులోని రన్‌వే పై పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ఎయిర్‌పోర్టు నుంచి విమా నాల రాకపోకలను రద్దు చేశారు.
ఇషికావా ప్రీ ఫెక్చర్లోని అనేక నగరాల్లో అలలు ఎగసి పడ్డాయి.కొన్ని తీర ప్రాంత నగరాల్లో తొంభై సెంటీమీటర్ల ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. మరికొన్ని చోట్ల దాదాపు ఒకటిన్నర మీటర్ల ఎత్తులో అలలు విజృంభించాయి. ఈ రేంజ్లో అలలు
సంభవించడంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒక దశలో ముందు జాగ్రత్తచర్యగా సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసింది. అయితే చివరకు జపాన్‌కు సునామీ ప్రమాదం తప్పింది. దీంతో సునామీ హెచ్చరికల తీవ్రతను జపాన్ ప్రభుత్వం తగ్గించింది.భూకంపాల కారణంగా అనేక చోట్ల బుల్లెట్ రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. దీంతో టొయామా, కంజావా స్టేషన్ల మధ్య దాదాపు పథ్నాలుగు వందల మంది ప్రయాణీకులు చిక్కుకుపోయారు.
భూకంపం సంభవించిన కొన్ని గంటల్లోనే యుద్ధ ప్రాతిపదికన సహాయక బృందాలను జపాన్ ప్రధాని కిషిద రంగంలోకి దింపారు.అయితే వరుస భూ కంపాలతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా రోడ్లు దెబ్బతి నడంతో సహాయక బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నాయి. ఇదిలా ఉంటే భూకంపాలు సంభ వించిన ప్రాంతాల ప్రజలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయడానికి జపాన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఉన్న తాధికారులకు జపాన్ ప్రధాని కిషిద ఆదేశాలు జారీ చేశారు.మొత్తానికి వరుస భూకంపాలు జపాన్ను తీవ్రంగా దెబ్బతీ శాయి. భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఈ విపత్తు నుంచి జపాన్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుం దంటున్నారు నిపుణులు.


