39.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

జనాలను ఫూల్స్‌ని చేసిన నటి పూనమ్‌ పాండే

      బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే జనాలను బకరా చేసింది. అభిమానులను ఫూల్స్‌ని చేసింది. తాను చనిపోలేదని, బతికే ఉన్నానని ఇవాళ పోస్టు పెట్టింది. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకే తాను చనిపోయినట్టు పోస్టులు పెట్టించినట్టు వీడియో సందేశం ఇచ్చింది. సర్వైకల్ క్యాన్సర్‌తో పూనమ్‌ పాండే చనిపోయినట్టు నిన్నంతా సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. పూనమ్‌ పాండే మేనేజర్‌ ఈ పోస్టు చేశాడు. చిన్న వయసులోనే పూనమ్ పాండే చనిపోవడంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ తాను చనిపోలేదని పూనమ్ పాండే మరో పోస్టు పెట్టారు. అంతేకాదు ఓ వీడియో కూడా విడుదల చేశారు. సర్వైకల్ క్యాన్సర్‌పై చాలా మంది మహిళలకు తెలియదని, దీనిపై అవగాహన కల్పించేందుకు తాను చనిపోయినట్లు ప్రచారం చేసినట్లు వీడియో ద్వారా చెప్పుకొచ్చారు.అయితే పూనమ్‌ పాండే తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. జనాలను బకరా చేయడమే కాకుండా ఇవాళ కవరింగ్ పోస్టు పెట్టడంపై మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసం ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్