బాలీవుడ్ నటి పూనమ్ పాండే జనాలను బకరా చేసింది. అభిమానులను ఫూల్స్‌ని చేసింది. తాను చనిపోలేదని, బతికే ఉన్నానని ఇవాళ పోస్టు పెట్టింది. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకే తాను చనిపోయినట్టు పోస్టులు పెట్టించినట్టు వీడియో సందేశం ఇచ్చింది. సర్వైకల్ క్యాన్సర్‌తో పూనమ్ పాండే చనిపోయినట్టు నిన్నంతా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. పూనమ్ పాండే మేనేజర్ ఈ పోస్టు చేశాడు. చిన్న వయసులోనే పూనమ్ పాండే చనిపోవడంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ తాను చనిపోలేదని పూనమ్ పాండే మరో పోస్టు పెట్టారు. అంతేకాదు ఓ వీడియో కూడా విడుదల చేశారు. సర్వైకల్ క్యాన్సర్‌పై చాలా మంది మహిళలకు తెలియదని, దీనిపై అవగాహన కల్పించేందుకు తాను చనిపోయినట్లు ప్రచారం చేసినట్లు వీడియో ద్వారా చెప్పుకొచ్చారు.అయితే పూనమ్ పాండే తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. జనాలను బకరా చేయడమే కాకుండా ఇవాళ కవరింగ్ పోస్టు పెట్టడంపై మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసం ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.