చైనాలో దాదాపు 47 మంది సజీవ సమాధి అయ్యారు. యునాన్ ప్రావిన్స్‌లోని గిరిజననులు నివసించే కొండ ప్రాంతా ల్లోని పలు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో దాదాపు 47 మంది గిరిజనులు సజీవసమాధి అయ్యారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది, డిజాస్టర్ దళాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కొండచరియలు విరిగిపడటంతో 18 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఆ నివాసాల్లో రెండు వందల మందికి పైగా నివసిస్తు న్నారు. ఊహించని విపత్తులో కొండ చరియలు విరిగిపడడంతో గిరిజనులు శిథిలాల కింద పడి మరణించారు. చరి యల కింద ఉన్న మృతదేహాలను వెలికి తీశారు. సహాయక చర్యల్లో 200 మంది ప్రభుత్వం యంత్రాగం పాల్గొన్నారు. గాయపడిన గిరిజనులను చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆసుపత్రులకు తరలించారు.


