32.8 C
Hyderabad
Thursday, March 5, 2026
spot_img

ఘాటుగా మారిన గుంటూరు రాజకీయయాలు

       గుంటూరు.. అనగానే చుర్రుమనిపించే గుంటూరు ఖారమే కాదు.. గుంటూరు జిల్లా.. రాజకీయాలు ఘాటుగానే ఉంటాయి. అదీ గుంటూరు స్పెషల్. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు తరుముకు వస్తుండడంతో గుంటూరు జిల్లాలో హడావుడి మొదలైంది. పార్టీ టికెట్లతో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇక పార్టీల విషయానికి వస్తే.. ముందస్తు అభ్యర్థుల ఎంపికతో అధికార వైసీపీ దూసుకెళ్తోంది. పొత్తు నేపథ్యంలో పక్కపార్టీతో ఆధారపడాల్సిరావడంతో టీడీపీ, జనసేన పరిస్థితి మరోలా ఉంది. తెలుగుదేశం శ్రేణుల్లో కాస్త నిర్లిప్తత కనిపిస్తుంది.

     తెలుగుదేశం పార్టీకి పట్టున్న జిల్లా గుంటూరు. టీడీపీ, జనసేన పొత్తు కారణంగా ఏఏ స్థానాల్లో ఏ పార్టీ గెలవాలన్న నిర్ణయం ఇంకా జరగలేదు. ఫలితంగా పార్టీ శ్రేణుల్లో కాస్త నిర్లిప్తత కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో నాన్సుడి ధోరణి.. ఆశావహుల్లో అలజడి పార్టీకి ఇబ్బందిగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ..గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంతో 15 నియోజకవర్గాల్లో అధికార వైసిపి గెలిచింది. ఒక్క గుంటూరు- 2 రేపల్లె నియోజకవర్గాల్లో మాత్రమే తెలుగుదేశం గెలిచింది ..రాజధాని ప్రాంతమైన తాటికొండ సైతం వైసీపీ ఖాతాలో పడింది ..జిల్లాలో ఉన్న మూడు ఎంపీ స్థానాలలో బాపట్ల ఎస్సీ రిజర్వ్, నరసరావుపేట వైసీపీ గెలుచుకోగా ..గుంటూరు నుండి టిడిపి అభ్యర్థి గల్లా జయదేవ్ సమీప అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పై విజయం సాధించారు. నర సరావుపేట ఎంపీగా వైసీపీ నుండి లావు కృష్ణదేవరాయలు గెలుపొందారు గెలిచిన ఎమ్మెల్యేలలో గుంటూరు 2 ఎమ్మెల్యే మద్దాలగిరి వైసీపీ పంచన చేరారు ..గత ఎన్నికల చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ తిరిగి గుంటూరు లో పట్టు కోసం పోరాడుతుంది.

     గుంటూరు ఉద్యామాలకు ప్రసిద్ధి..ఇక్కడి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఆయా నియోజకవర్గాలలో నాలుగున్నర ఏళ్లుగా అధికార వైసీపీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిలుగా నియమించినప్పటికీ కొన్ని నియోజకవర్గాలలో వారిని అభ్యర్థులుగా కొనసాగిస్తారా? లేదా? అన్న అనుమానాలు తలెత్తడంతో కొంత గందరగోళం నెలకొంది.. ఇక పార్లమెంటు పరిధిలో అభ్యర్థులు ఎంపికపై ఇంకా క్లారిటీ రాలేదు.బాపట్ల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో అధికార పార్టీ కూడా అభ్యర్థి ఎంపికపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. గుంటూరు ఎంపీ అభ్యర్థి ఎంపిక కూడా నిర్ణయించలేదు. ఇక నరసరావుపేట అధికార పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవ రాయ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఇంకా ఏ పార్టీలో చేరలేదు. తెలుగుదేశంలో చేరడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. .దీనిపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే కృష్ణదేవరాయలు నరసరావుపేట నుండి వైసీపీ టికెట్ ఆశించి ఆ పార్టీ అధిష్టానం నో చెప్పడంతో ఆ పార్టీని వీడి వెళ్లిపోయారు. మాజీ మంత్రి నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ దాదాపుగా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు వైసిపి అధిష్టానం నిర్ణయించి నట్లు చెబుతున్నారు. బీసీ ఓట్ల బ్యాంకును దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అధికార పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది.

       ఇక తెలుగుదేశం పార్టీ నుండి నరసరావుపేట అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేస్తారని, ఆయనకు టిడిపి అధిష్టానం నుండి స్పష్టమైన హామీ కూడా లభించినట్లు ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఇక గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టంగా చెప్పడంతో తెలుగుదేశం కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. అయితే ఇప్పటికే ప్రముఖ విద్య వేత్త భాష్యం రామకృష్ణ, ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్యేల ఎంపిక విషయంలో కొన్ని నియోజకవర్గాల టిడిపిలో స్పష్టత లేదు. జనసేన- తెలుగుదేశం పొత్తుల పై కూడా స్వస్థత రాకపోవడంతో అభ్యర్థుల ఎంపిక లో ఆలస్యం జరుగుతోంది. ఇది అధికార పార్టీకి కలిసొచ్చే అంశంగా మారింది

      అధికార వైసిపి దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించింది. ప్రకటించిన వైసీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు ..టిడిపికి పట్టున్న గుంటూరు 2 లో బలమైన అభ్యర్థిని వైసీపీ రంగంలో దింపింది. .గత ఎన్నికల్లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న బీసీ మహిళ విడుదల రజిని గుంటూరు 2 వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఇక్కడ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న కోవెలమూడి రవీంద్ర కు టిడిపి సీటుపై స్పష్టత లేదు ..ఈ నియోజకవర్గం నుండి దాదాపు పది మంది టీడీపీ సీటు కోసం కుస్తీ పడుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్త డేగల ప్రభాకర్, ప్రముఖ డాక్టర్ శేషయ్య.. ఎన్నారై మోహన్ కృష్ణ ..తదితరులు ఉన్నారు అయితే తెలుగుదేశం రజిని కి ప్రత్యర్థిగా బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతుంది అలాంటప్పుడు ప్రస్తుతం టిడిపి ఇన్చార్జి నానికి సీటు లేనట్లేనని చెబుతున్నారు.

      నరసరావుపేట, పెదకూరపాడు, తెనాలి వంటి సీట్లపై కూడా టిడిపిలో స్పష్టత లేదు ..జనసేనతో పొత్తు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో తెనాలి సీటును ఆ పార్టీలో కీలక నేత నాదెండ్ల మనోహర్ కు ఇస్తారని చెబుతున్నారు. అయితే అక్కడి టిడిపి సీనియర్ నేత ఆలపాటి రాజా తిరిగి తెనాలి నుండి పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు ..ఇటీవల కొందరు కార్యకర్తలు తిరిగి రాజాకి టికెట్ ఇవ్వాలని కిరోసిన్ పోసుకొని ప్రయత్నం చేసి అధిష్టానానికి పరోక్షంగా హెచ్చరిక లు జారీ చేశారు. అదేవిధంగా గుంటూరు 1, 2 సీట్లపై కూడా జనసేన కన్నేసింది ..ఆ పార్టీ మరో బీసీ నేత బోన బోయిన శ్రీనివాస్ యాదవ్ గుంటూరు 2 పై పట్టుపడుతున్నారు.

       భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా.. టీడీపీ -జనసేన -తో పొత్తులో వెళ్తుందా. అన్నది స్పష్టం కాలేదు. బీజేపీ అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో కేడర్ లో గందరగోళం నెలకొంది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా పొత్తులపై కేంద్ర నాయకత్వం స్పష్టత ఇచ్చేవరకూ.. మాట తూలకుండా.. ఆచీ తూచీ వ్యవహరిస్తు న్నారు. కానీ, కొందరు పార్టీ నాయకులు మాత్రం తమ వంతు ప్రచారం చేసుకుంటున్నారు. గుంటూరు 2 నుండి పోటీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీ సీనియర్ నేత వల్లూరి జయప్రకాష్ ఇప్పటికే గుంటూరు పశ్చిమ నుండి పాదయాత్ర కూడా నిర్వహించి ఆ పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి తో గుంటూరులో భారీ బహిరంగ కూడా నిర్వహించారు. కమలదళనేతలు.. కాషాయి జెండా ఊపితే.. ఎన్నికల గోదాలో దిగేందుకు పలువురు నాయకులు సిద్ధంగా ఉన్నారు.

           జనసేన- బిజెపిల పొత్తుపై కూడా స్పష్టత రాకపోవడంతో తెలుగుదేశం సీట్ల ఎంపికలో గందరగోళం నెలకొంది. గుంటూరు 2 నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉంటే.. గుంటూరు జిల్లాలో అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశంలో అయోమయం నెలకొనడంతో అధికార పార్టీకి కొంత కలిసివస్తుందన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. టీడీపీకి పట్టున్న గుంటూరు ఆ పార్టీ జెండా ఎగరవేయాలంటే అభ్యర్థులపై పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయు డు సుస్పష్టమైన ప్రకటన చేయాలి. స్పష్టతను ఇవ్వాలని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు సమీపి స్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక రాజకీయ పార్టీలకు జటిలమైన సమస్యగా మారింది ఉద్దండులున్న గుంటూరు ప్రాంతంలో అభ్యర్థుల ఎంపిక తెలుగుదేశం అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఎప్పుడు క్లారిటీ వస్తుందో అని క్యాడర్ ఎదురు చూస్తున్నారు.

       ఏపీలో…అధికార వైసీపీ గ్రాఫ్.. పడిపోతోంది. అభ్యర్థుల మార్పులు, చేర్పులతో వైసీపీ అధినేత జగన్ తలమునకలై ఉన్నారు. ఈ గందరగోళం నుంచి బయటపడి వైసీపీ పుంజుకునేలోగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కచ్చితంగా కూర్చుని ఏఏ స్థానాలు .. ఎవరెవరు పోటీ చేయాలి.. అని తేల్చుకోవడమే కాదు.. బహిరంగ ప్రకటన చేసి.. అభ్యర్థులను ప్రకటిస్తే తప్ప.. రెండు పార్టీల అభ్యర్థులు, కార్యకర్తల్లో ఉన్న గందరగోళం.. తొల గి పోదు.. కేవలం పొత్తుతోనే గెలుస్తామనే .. మితిమీరిన విశ్వాసం తో సాగడం రెండు పార్టీలకూ సరికాదు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్