తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకి ఎమ్మెల్యే లందరిని తిసుకెళ్లడం వెనుక వ్యూహం ఏంటి..? గత ప్రభుత్వం లో నిర్మించిన ప్రాజెక్టు లో లోపాలను చూపించి బీఆర్ఎస్‌ను ఆత్మరక్షణ లోకి నెట్టే ఎత్తుగడా? లేక లోపా లను సవరించేందుకు జనాభిప్రయాన్ని కూడగట్టే ప్రయత్నంలో భాగమేనా ? లోక్ సభలో ఎన్నికలను దృష్ట్యా బీఆర్ఎస్ తో కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతుందా?
మేడిగడ్డ బ్యారేజ్ వద్ద జరిగిన డ్యామేజ్ ని ఎమ్మెల్యే లను చూపించడానికి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. బ్యారేజ్ వద్ద ఇప్పటికే 16 వ పిల్లర్ నుంచి 22 వ పిల్లర్ వరకు డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ జరిగిన బ్యారేజ్ ని ఇప్పటికే మంత్రుల బృందం పరిశీలించి, అక్కడే పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు.. అయినప్పటికీ అప్పటి నుంచి అధికార విపక్షాల మధ్య కాళేశ్వరంపై మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా ఇదేవిధంగా కాళేశ్వరం సందర్శనకు ప్రతిపక్షాలను ఆహ్వానించింది. అయితే అప్పుడు కాళేశ్వరం నిర్మాణం, తప ప్రభు త్వం చేసిన గొప్ప పనిని చూపించే ప్రయత్నం చేసింది. అప్పుడు ప్రభుత్వ ఆహ్వానాన్ని ప్రతిపక్షాలు తిరస్క రించాయి. ప్రస్తుతం కొత్త గా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాళేశ్వరంపై ఫోకస్ చేసింది. అయితే ప్రతి పక్షంలో ఉనప్పటి నుంచే కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పుడు అదే అంశాన్ని ప్రజలకు చెప్పేందుకు ఎమ్మెల్యేలను సందర్శనకు తీసుకెళ్ళేందుకు సిద్ధం అయింది.
ఈ టూర్ కు తాము రాలేమని బీజేపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేసారు.. తాము కూడా కాళేశ్వరంకు వెల్లాల్సిన అవస రం లేదని బీఆర్ఎస్ కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఈ పర్యటన కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లే అవకాశం కనిపిస్తుంది. మంగళవారం ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యేల బృదం అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో కాళేశ్వరం బయలుదేరుతారు. మధ్యాహ్నం వరకు మేడిగడ్డకు చేరుకుంటారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన పిల్లర్లను పరిశీలించి, సాయంత్రం తిరిగి పయాణం అవుతారు .అయితే కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం టూర్ ఆంతర్యం ఏమిటి? అనే చర్చ అంతట వినిపిస్తుంది. కాళేశ్వరం లోపాలను, పిల్లర్ల కుంగుబాటును అన్ని పార్టీలకు చూపించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం పని తనాన్ని ఎండగట్టేందుకు కాంగ్రెస్ వినియోగించుకునే ఛాన్స్ ఉంది. అదే సమయంలో లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్ట్ లో నెలకొన్న లోపాలను ఎలా సవరించాలో ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసు కోవడం…తద్వారా ప్రజల్లో చర్చ జరిగేలా చూడటం కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ గా ఉందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.