29.1 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

కమలనాథులకు హిందూత్వం వరంగా మారుతుందా ?

       హిందూత్వ అజెండాగా లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందా ? అయోధ్య రామా లయ నిర్మాణం ఇంకా పూర్తిస్థాయిలో కాకపోయినా ప్రారంభించింది అందుకేనా ? కేవలం ఇదే కాదు.. అబూదాబి లో నిర్మించిన హిందూ దేవాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు సరే… ఇది కూడా ఓట్ల వేటలో భాగమేనా ? ఇలా ఒకటీ రెండూ కాదు.. కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోడీ అడుగులు గమనిస్తే.. ఇదే అభిప్రాయం తలెత్తక మానదు అన్న వాదన బలంగా విన్పిస్తోంది.

    సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు అవసరమైన అన్ని ఎత్తులు వ్యూహాలు వేస్తున్నారు కమలనాథులు. ఇందు లో భాగంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 370కి పైగా స్థానాలను గెలుచుకుంటుందని చెబుతున్నారు ప్రధాని మోడీ. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన, చేపడుతున్న కార్యక్రమాలే తమ విజయానికి సోపానాలంటూ పార్లమెంటు సాక్షిగా ఇటీవలె ప్రకటించారు ప్రధాని. కేవలం ప్రధాని మోడీ మాత్రమే కాదు.. బీజేపీ నేతలు ఎవర్ని పలకరించినా ఇదే మాట. ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి ఒంటరిగానే నాలుగు వందల సీట్ల మార్కును చేరుకుంటామని అంటు న్నారు. ఈ నేపథ్యంలో కమలం నేతల దీమా ఏంటి అన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదే సమయంలో తెరపైకి వస్తున్న అంశం హిందూత్వ. అవును.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించేందుకు బీజేపీ ఎంచుకున్న అజెండా హిందూత్వ అన్న ప్రచారం సాగుతోంది. నూటికి నూరు శాతం ఇదే అజెండా అని చెప్పకపో యినా.. 70 శాతం హిందూత్వ అజెండా, మరో 30 శాతం అభివృద్ధి, దేశ భద్రత, ప్రభుత్వ సుస్థిరత అన్న మాటలు విన్పిస్తున్నాయి. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత, మోదీ ఛర్మిష్మాతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కమలనాథులు.. ఆ తర్వాత 2019లో మరోసారి విజయం సాధించారు. ఈసారి పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్‌తో గణనీయంగా లాభం పొందింది బీజేపీ. మరి.. రాబోయే ఎన్నికల్లో ఏంటి అంటే హిందూత్వ అనే చెప్పాలి.

    ఇందులో భాగంగానే కొన్ని నెలల ముందు నుంచే వ్యూహాత్మకంగా పావులు కదిపింది బీజేపీ అన్న వాదన విన్పి స్తోంది. ఈ క్రమంలోనే అయోధ్య రామాలయాన్ని ఎంచుకున్న బీజేపీ…నిర్మాణం పూర్తికాక పోయినా ప్రారంభించిందన్న కామెంట్లు విన్పించాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా అంతా రామ మయం అన్నట్లుగా వాతావరణాన్ని సృష్టించిం దన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, చివరకు ప్రారంభ ఘట్టానికి హాజరుకాకపోయినా డోంట్ కేర్ అన్నట్లుగా ముందుకు సాగారు ప్రధాని మోడీ. దీంతో…. హిందువుల్లో కమలనాథులపై ఇప్పటికే ఉన్న సానుకూలత కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇమేజ్ పెరిగిందన్న మాట విన్పిస్తోంది. అయోధ్యతోనే ప్రధాని మోడీ వ్యూహం ఆగిపోలేదు. ఈ కోవలోనే ఆయన తాజాగా అబూదాబిలో ప్రసిద్ధ హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు. ప్రత్యేక పూజ లు చేశారు. అందులోని పూజారులతో ముచ్చటించారు మోడీ. భారత దేశానికి వెలుపల కూడా ప్రధాని మోడీ ఇలా ఆలయాల వెంట తిరగడంతో హిందువులకు ఆయన ఓ బ్రాండ్ అంబాసిడర్‌గా, ఇంకా చెప్పాలంటే కరడుకట్టిన హిందూ మద్దతు దారుగా నిలుస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. దీనిపై విపక్షాలు ఎన్ని విమర్శ నాస్త్రాలు సంధించినా వెనక్కు తగ్గేది లేదంటోంది బీజేపీ. మరి… రానున్న ఎన్నికల్లో నిజంగా హిందూత్వం కమలనాథులకు వరంగా మారుతుందా? మరోసారి అధికారం అందేలా చేస్తుందా ? ఇది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్